Breaking News

జరిమానా విధిస్తాం జాగ్రత్త

Published on Sat, 05/17/2025 - 00:59

సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఇష్టం వచ్చినట్లు ఒకే విషయంపై పదే పదే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది జాగ్రత్త..’అని గ్రూప్‌–1 అభ్యర్థులను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘ఈ విషయమై గతంలోనూ కొందరు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు అయ్యాక దీనిపై వాదనలు అవసరమా అని అప్పుడే మేం ప్రశ్నించాం. ఆ పిటిషన్‌ను డిస్మిస్‌ చేశాం. ఇప్పుడు మళ్లీ మీరెందుకు వచ్చారు? మేం డిస్మిస్‌ చేసిన విషయం మీకు తెలియదా?’అంటూ నిలదీసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అభ్యర్థులు పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు, ఆ పిటిషన్‌ విత్‌డ్రాకు ధర్మాసనం అనుమతి ఇచి్చంది.

గ్రూప్‌–1,2,3 నోటిఫికేషన్లకు సంబంధించిన జీవో 29, జీవో 33ను, పీహెచ్‌సీ రిజర్వేషన్లు వర్టీకల్‌గా అమలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కుమ్మరి ప్రవీణ, మరో 12 మంది 370 పేజీలతో కూడిన రిట్‌ పిటిషన్‌ను ఏప్రిల్‌ 30న సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ జోమాల్య బగి్చలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, పిటిషనర్ల తరపున రానా ముఖర్జీ వాదనలు వినిపించారు.

గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వ్యవహారంలో జీవో 29 రద్దు అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరిపి, కొట్టివేసిందని నిరంజన్‌ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అభ్యర్థులపై సీరియస్‌ అయ్యింది. ‘పిటిషన్‌లో కొత్తగా ఏం ఉంది? ఒకే అంశంపై ఇంతమంది ఇన్నిసార్లు ఎందుకు? ఇలా చేస్తే జరిమానా విధిస్తాం..’అని హెచ్చరించింది. దీంతో పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రానా ముఖర్జీ అభ్యర్థించగా ధర్మాసనం అంగీకరించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)