Breaking News

చైల్డ్‌ పోర్నోగ్రఫీపై ఆ తీర్పు దుర్మార్గం: సుప్రీం

Published on Tue, 03/12/2024 - 06:29

న్యూఢిల్లీ: చైల్డ్‌ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్‌ చేయడం, చూడటం నేరం కాదంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దుర్మార్గంగా అభివర్ణించింది. ఆ తీర్పుపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. చెన్నైకి చెందిన ఎస్‌.హరీశ్‌(28) పిల్లలతో కూడిన పోర్నోగ్రఫీ కంటెంట్‌ను తన సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నాడంటూ పోలీసులు కేసు పెట్టారు. దీనిపై హరీశ్‌ మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లాడు.

విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం పోక్సో, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాల ప్రకారం చైల్డ్‌ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేయడం, చూడటం నేరం కాదని పేర్కొంటూ జనవరి 11వ తేదీన తీర్పు వెలువరించింది. దీనిని సవాల్‌ చేస్తూ ఫరీబాద్‌కు చెందిన జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ అనే ఎన్‌జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు చట్టాలకు వ్యతిరేకం, దుర్మార్గమని పేర్కొంది. ఏకసభ్య ధర్మాసనం ఇలాంటి తీర్పు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)