Breaking News

‘వీధి కుక్కల అంశం’పై సుప్రీం తీర్పు రిజర్వు

Published on Fri, 01/30/2026 - 05:21

న్యూఢిల్లీ: వీధికుక్కల కట్టడిపై గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ అంశంపై గురువారం వాదనలు ముగించిన జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాల ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. హైవేలపైకి వచ్చే వీధి పశువుల కోసం, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టు కంపెనీలను సామాజిక బాధ్యతగా గోశాలలను ఏర్పాటు చేయాలని కోరాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కి సూచించింది. జాతీయ రహదారులపైకి వచ్చే వీధి పశువుల విషయంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని కోరింది.

జాతీయ రహదారులపైకి పశువులు ప్రవేశించే ప్రమాదమున్న ప్రాంతాలు దేశవ్యాప్తంగా 1,300కుపైగా ఉన్నాయని ఎన్‌హెచ్‌ఏఐ లాయర్‌ తెలిపారు. చాలా వరకు రాష్ట్రాలు పశువుల సంచారం కట్టడికి చర్యలు తీసుకున్నాయన్న ఆయన..ఈ విషయంలో మహారాష్ట్రం, జార్ఖండ్, రాజస్తాన్‌లు వెనుకబడ్డాయన్నారు. వీధి కుక్కల పునరావాసం, స్టెరిలైజేషన్‌కు సంబంధించిన గతేడాది నవంబర్‌ 7వ తేదీన జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై పంజాబ్, రాజస్తాన్, యూపీ, తమిళనాడు ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

పంజాబ్‌ ప్రభుత్వం రోజుకు కేవలం వంద శునకాలకు మాత్రమే స్టెరిలైజేషన్‌ చేసినట్లు తెలపగా, వీధికుక్కలను పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 45 వ్యాన్లు ఉన్నాయంటూ రాజస్తాన్‌ ప్రభుత్వం తెలపడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. గడ్డి వాములో సూదిని వెదికినట్టు ఉందంటూ వ్యాఖ్యానించింది. వీధి కుక్కల సమస్యను ఇప్పుడు నియంత్రించకుంటే ఏటికేడు మరింత పెరుగుతూనే ఉంటుందని పేర్కొంది.

నవంబర్‌ 7వ ఉత్తర్వుల తర్వాత జంతువుల షెల్టర్లు, స్టెరిలైజేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ పలు ఎన్జీవోలు, ప్రైవేట్‌ సంస్థల నుంచి 250కి పైగా దరఖాస్తులు అందాయని ఎనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(ఏడబ్ల్యూబీఐ)ప్రతినిధి చెప్పారు. వీటిని ఆమోదించడమా లేదా తిరస్కరించడమా వెంటనే తేల్చేయాలని ధర్మాసనం ఆదేశించింది.     

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)