Breaking News

SC: సిసోడియా పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Published on Tue, 08/06/2024 - 14:00

 ఢిల్లీ:  లిక్కర్‌ పాలసీ కేసులో ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ పూర్తైంది. సీబీఐ, ఈడీ కేసుల్లో  ఆయన బెయిల్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం (ఆగస్ట్‌6 న)తో వాదనలు పూర్తి కాగా,  కోర్టు తీర్పును వాయిదా వేసింది. 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియా 17 నెలలకు పైగా జైలులో ఉన్నారు. గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఆయన అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు  బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా  సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. సిసోడియాకు సుదీర్ఘ జైలు శిక్ష కొనల్సిన అవసరం లేదని గతంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అంతేకాదు.. 

ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి. కానీ, అలాంటిదేం జరగలేదని.. పైగా సరైన ఆధారాల్ని కూడా ఉంచలేదని సింఘ్వీ  బెంచ్‌  దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ, ఈడీ తరఫు లాయర్‌ వాదించారు. దీంతో.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు బెంచ్‌ ప్రకటించింది.   

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)