Breaking News

‘స్వలింగ వివాహాల’పై  తీర్పు సరైనదే: సుప్రీం

Published on Fri, 01/10/2025 - 05:21

న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ వివాహాల విషయంలో సుప్రీంకోర్టు తన వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టినట్లు తేల్చేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేమంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు నిరాకరించింది. ఈ తీర్పును మళ్లీ క్షుణ్నంగా పరిశీలిచాలంటూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. 

స్వలింగ వివాహాలకు చట్టపరంగా గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆధారం లేదని 2023 అక్టోబర్‌లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్‌ తదితర వర్గాలు ఆందోళనకు దిగాయి. స్వలింగ వివాహాలపై అప్పట్లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఆయా పిటిషన్లను పరిశీలించింది. 2023 నాటి తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని తేల్చిచెప్పింది. అప్పటి తీర్పులో వెల్లడించిన అభిప్రాయాలు చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. ఆ తీర్పులో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. రివ్యూ పిటిషన్లను డిస్మిస్‌ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టంచేసింది.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)