Breaking News

లోక్ అదాలత్‌కు జ్ఞానవాపి, మథుర.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం!

Published on Mon, 07/13/2026 - 10:24

న్యూఢిల్లీ: దేశంలో వివాదాస్పదంగా మారిన జ్ఞానవాపి మసీదు, మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు, సంభాల్ హరిహర మందిరం-మసీదు కేసులను సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్‌కు బదిలీ చేసింది. సుదీర్ఘ కోర్టు వ్యాజ్యాల కంటే చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనేందుకు ఆగస్టు 21 నుంచి 23 వరకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘సమాధాన్ సమారోహ్‌’ పేరిట ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరుపక్షాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

గత ఏప్రిల్ 21 నుంచే కింది కోర్టుల్లో ముందస్తు రాజీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జూలై 14న వారణాసిలో జ్ఞానవాపి కేసుపై ముందస్తు విచారణ జరగనుంది. కాగా మథుర వివాదంలో జూలై 5న జరిగిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలం కావడంతో, సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ప్రత్యేక లోక్ అదాలత్ పరిధిలోకి తెచ్చింది.

మొఘల్ కాలంలో ఆలయాలను కూల్చివేసి ఈ మసీదులను నిర్మించారంటూ హిందూ పక్షాలు కోర్టులను ఆశ్రయించగా, 1991 నాటి ఆరాధనా స్థలాల చట్టం ప్రకారం ఈ పిటిషన్లు చెల్లవని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి. గత ఏడాది సంభాల్‌ మసీదు సర్వే ఉద్రిక్తతలకు దారితీసి, పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూడు వివాదాల్లోని చట్టపరమైన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది.
 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)