Breaking News

ఆయన్ని అవమానించడం మా ఉద్దేశం కాదు: సుప్రీం కోర్టు

Published on Fri, 08/08/2025 - 12:30

అలహాబాద్‌ హైకోర్టు జడ్జిపై సుప్రీం కోర్టు విధించిన ఆంక్షలు న్యాయ వివాదానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో దేశసర్వోన్నత న్యాయస్థానం వెనక్కి తగ్గింది. సదరు జడ్జి క్రిమినల్‌ కేసు విచారించకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది.

న్యూఢిల్లీ: అలహాబాద్‌(యూపీ) హైకోర్టు జడ్జిపై ఆంక్షల విషయంలో సుప్రీం కోర్టు వెనక్కి తగ్గింది. సదరు జడ్జి క్రిమినల్‌ కేసులు విచారించకుండా గతంలో ఉత్తర్వులు వెలువరించిన సుప్రీం కోర్టు.. శుక్రవారం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఈ ఆంక్షలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం, అదే సమయంలో చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్‌ పార్దీవాలా తెలిపారు. అదే సమయంలో ఈ కేసును రీలిస్టింగ్‌కు రిజిస్ట్రీని ఆదేశించారాయన.  

మేము ఆ న్యాయమూర్తిని అవమానించాలనుకోలేదు. అలాంటి ఉద్దేశాలు మాకు లేవు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే మాస్టర్ ఆఫ్ రోస్టర్. కేసుల కేటాయింపు ఆయన అధీనంలో ఉంటుంది అని జస్టిస్‌ పార్దీవాలా స్పష్టం చేశారు. ‘‘న్యాయవ్యవస్థలో అంతర్భాగమైనప్పటికీ సుప్రీం కోర్టు సాధారణంగా హైకోర్టుల పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు.  అయితే, ఒక సందర్భం ఒక పరిమితిని దాటి.. సంస్థ గౌరవం ప్రమాదంలో పడినప్పుడు దానిని కాపాడేందుకు అవసరమైన చర్యగా ఈ కోర్టు తన రాజ్యాంగ బాధ్యతను(ఆర్టికల్ 136 ప్రకారం) నిర్వర్తించాల్సి వస్తుంది’’ అని అన్నారాయన. 

ఒక సివిల్‌ పరిష్కారానికి ఆస్కారం ఉన్న వివాదంలో క్రిమినల్‌ చర్యలకు అనుమతినిస్తూ అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేయడం ఈ వివాదానికి కారణమైంది. ‘‘కేవలం సివిల్ పరిష్కారం జరిగిందని చెప్పి, నేరాన్ని మాఫీ చేయడం రాజ్యాంగబద్ధంగా కాదు. న్యాయవ్యవస్థకు ఇది ప్రమాదకరం. ’’ అని వ్యాఖ్యానించారాయన. ఈ ఆదేశాలపై జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మహదేవన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌కు రిటైరయ్యేంత వరకూ ఎలాంటి క్రిమినల్‌ కేసులు అప్పగించవద్దని ఈ నెల 4న ఆదేశించింది.

అయితే.. ఈ వ్యవహారం న్యాయ వివాదానికి తెరతీసింది. సుప్రీంకోర్టు ఆదేశంలోని కొన్ని అంశాలు అమలు కాకుండా నిరోధించేందుకు ఫుల్‌ కోర్టును సమావేశపరచాలంటూ అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తులు కోరారు. ఈ మేరకు జడ్జీలు అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ కూడా రాశారు కూడా. 

అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ ఆరిందం సిన్హా.. హైకోర్టు నియమానుసారం ఈ లేఖ రాయగా దానిపై మరో 12 మంది న్యాయమూర్తులు సంతకాలు చేశారు. హైకోర్టులపై పాలనాపరమైన పర్యవేక్షణ అధికారం సుప్రీంకోర్టుకు లేదని, అందుకే ఆగస్టు 4నాటి సుప్రీం ఆదేశాల్లో 24వ, 26వ పేరాల్లోని నిర్దేశాలను అమలు చేయరాదని ఫుల్‌కోర్టు తీర్మానించాలని జడ్జీలు కోరారు. సుప్రీం ధర్మాసనం మాటల్లోని తీవ్రతను ఫుల్‌ కోర్టు తీర్మానం తప్పు పట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయా పేరాల్లోని ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)