Breaking News

కల్నల్‌ నియామకాల్లో మహిళలకు అన్యాయం... నిబంధనలకు విరుద్ధం: సుప్రీం

Published on Sat, 11/04/2023 - 05:34

న్యూఢిల్లీ: మహిళా అధికారులకు కల్నల్‌గా పదోన్నతి కలి్పంచేందుకు సైన్యం నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమకు కల్నల్‌గా ప్రమోషన్‌ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మహిళా సైనికాధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ జె.బి.పార్డీవాలా, జస్టిస మనోజ్‌ మిశ్రా ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మహిళా సైనికాధికారులు సైనయంలో తమకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు, బాధ్యతలను చిరకాలం పాటు పోరాడి మరీ సాధించుకున్నారని అభిప్రాయపడింది.

కల్నల్‌ ప్రమోషన్ల విషయంలో మహిళా అధకారుల రహస్య వార్షిక నివేదిక (సీఆర్‌)లకు సైన్యం కటాఫ్‌ తేదీని వర్తింపజేసిన తీరు వారికి అన్యాయం చేసేదిగా ఉందంటూ ఆక్షేపించింది. కనుక కల్నల్‌ ప్రమోషన్ల ప్రక్రియను 15 రోజుల్లోగా తాజాగా చేపట్టాలని సైన్యాన్ని ఆదేశించింది. లింగ వివక్షకు తావులేకుండా మహిళా సైనికాధికారులకు కూడా కల్నల్‌ తదితర పదోన్నతులు కలి్పంచాలంటూ 2020లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. నేవీలో కూడా దీన్ని వర్తింపజేయాలంటూ కొద్ది రోజులకే మరో తీర్పు వెలువరించింది. సాయుధ దళాల్లో మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడేందుకు తమ తీర్పులు తోడ్పడతాయని ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)