Breaking News

తెలంగాణ సివిల్‌ జడ్జీల ప్రధాన పరీక్ష రాసేందుకు ఆ 11 మందికి అనుమతి

Published on Thu, 08/08/2024 - 06:05

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సివిల్‌ జడ్జీల ప్రధాన పరీక్ష రాయడానికి ఏపీకి చెందిన 11 మందికి సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చంది. ఏపీకి చెందిన విందేల గీతాభార్గవి, సయ్యద్‌ సూఫియా, గంటా లావణ్య, రావూరి నాగలలిత శ్రీరమ్య ప్రభ, గుడిపల్లి దినేష్, పులి నాగవర్ధన్‌బాబు, షేక్‌ ఖమర్‌ సుల్తానా, మీనిగ హేమలత, మధునిక విశ్వనాథం, టి.రవికుమార్, బి.ప్రశాంత్‌బాబు తెలంగాణ సివిల్‌ జడ్జీల ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే తెలంగాణ బార్‌ అసోసియేషన్‌ నుంచి ఎన్‌రోల్‌మెంట్‌ సరి్టఫికెట్లు లేకపోవడంతో ప్రధాన పరీక్షకు సంబంధించి ఆ పత్రాలు సమర్పించలేకపోయారు.

తెలంగాణ బార్‌ అసోసియేషన్‌ నమోదు తప్పనిసరి అని నోటిఫికేషన్‌లో నిబంధన పేర్కొనడం వల్ల వీరంతా ప్రధాన పరీక్షకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో, ఈ నిబంధన ఏకపక్షంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర న్యాయ(సరీ్వస్, కేడర్‌)రూల్స్, 2023కు విరుద్ధంగా ఉందంటూ వారంతా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ డీవై.చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం, రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌–1)లకు నోటీసులు జారీ చేసింది.

బుధవారం ఆదేశాలు వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసింది. అయితే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకే సమయం ఉందని, మధ్యంతర ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితు భరద్వాజ్, అమోల్‌ చిత్రవంశి, రజత్‌గౌర్‌లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం ఏప్రిల్‌ 10, 2024న జారీ చేసిన నోటిఫికేషన్‌తో ప్రారంభమైన రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో పాల్గొనడానికి పిటిషనర్లకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే, కోర్టు తుది ఉత్తర్వులు వచ్చే వరకూ పిటిషనర్ల ఫలితాలు ప్రకటించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 23కు వాయిదా వేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)