Breaking News

పబ్లిక్‌ స్థలాల్లో మహిళలు, శిశువులకు  వసతులు కల్పించాలి

Published on Thu, 02/20/2025 - 06:37

న్యూఢిల్లీ:  పబ్లిక్‌ స్థలాల్లో నిర్మించిన భవనాలు, నిర్మించబోయే భవనాల్లో శిశువుల సంరక్షణకు, వారికి తల్లులు స్తన్యం ఇచ్చేందుకు ప్రత్యేక వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలని సూచించింది. ప్రత్యేక గదుల్లాంటివి నిర్మిస్తే తల్లుల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుందని, పిల్లలకు సైతం మేలు జరుగుతుందని వెల్లడించింది.

 పబ్లిక్‌ స్థలాల్లో ఫీడింగ్‌ రూమ్‌లు, చైల్డ్‌కేర్‌ గదులు నిర్మించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తల్లులు, బిడ్డల కోసం భవనాల్లో తగినంత స్థలం కేటాయించి, వసతులు కల్పించాలని పేర్కొంది.

 సుప్రీంకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫు హాజరైన న్యాయవాది స్పందిస్తూ... పబ్లిక్‌ స్థలాల్లో తల్లులు, శిశువులకు వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ 2024 ఫిబ్రవరి 27న కేంద్ర మహిళ, శిశు అభివృద్ది శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ ఆదేశాలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తంచేసింది. ఆదేశాలను రాష్ట్రాలకు మరోసారి గుర్తుచేయాలని పేర్కొంది.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)