Breaking News

కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Published on Wed, 08/16/2023 - 15:02

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మధురలోని కృష్ణజన్మభూమి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో పదిరోజుల పాటు ఎలాంటి కూల్చివేతలను చేపట్టవద్దని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్‌వీఎన్‌ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. మరో వారం పాటు విచారణను వాయిదా వేసింది. 

మధురలో రైల్వే భూభాగాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని రైల్వేశాఖ చేపట్టింది. ఆగష్టు 9న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే 100కు పైగా ఇళ్లను కూల్చివేశారు. అయితే.. ఇది పూర్తిగా అన్యాయమని బాధితులు సుప్రీకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ధర్మాసనం ప్రస్తుతానికి కూల్చివేతలను ఆపి యధాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంటూ తీర్పును వెలువరించింది. 

రైల్వే ప్రాంతంలో నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని బాధితుల తరుపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. యూపీలో న్యాయవాదుల సమ్మె కారణంగానే కోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో బాధితులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత 100 ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఉన్నపళంగా వెళ్లగొడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కేవలం 80 ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు.  

ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌.. ఎన్నికల కమిటీ కీలక సమావేశం


 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)