Breaking News

బార్‌ కౌన్సిళ్లలో మహిళా లాయర్లకు 30% సీట్లు 

Published on Tue, 12/09/2025 - 05:21

న్యూఢిల్లీ: రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30 శాతం సీట్లు కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ఆయా కౌన్సిళ్లలో ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలుకాని రాష్ట్రాల్లోనే తమ నిర్ణయాన్ని వర్తింపజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగీ్చల ధర్మాసనం స్పష్టంచేసింది. ‘‘కౌన్సిళ్లకు ఎన్నికలు జరగని పక్షంలో ఆయా రాష్ట్రాల్లో మహిళలకు 20 శాతం సీట్లు కేటాయించాలి.

 పోటీ చేయడానికి సరిపడా మహిళా అభ్యర్థులు లేనిపక్షంలో మరో10 శాతం సీట్లను వీలైతే పురుషులకు కేటాయించుకోవచ్చు’’అని ధర్మాసనం స్పష్టంచేసింది. గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఇప్పటికే ఆరు బార్‌ కౌన్సిళ్లలో ఎన్నికల ప్రక్రియ మొదలెట్టేశామని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) ఛైర్మన్‌పర్సన్, సీనియర్‌ న్యాయవాది మనన్‌ కుమార్‌ మిశ్రా తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ బార్‌ కౌన్సిళ్లలో ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. అన్ని రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లలో మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్‌ అమలుచేయాలని లాయర్లు యోగమయ ఎంజీ, షెహ్లా చౌదరిలు వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఆఫీస్‌ బేరర్‌ పోస్టుల్లో కనీసం ఒక్కటైనా మహిళలకు కేటాయించాలని వాళ్లు ధర్మాసనాన్ని గతంలో కోరారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ఒక ఆఫీస్‌బేరర్‌ పోస్ట్‌ రిజర్వ్‌చేస్తూ గత ఏడాది మే రెండో తేదీన సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే.  

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు