Breaking News

మణిపూర్‌ హింస కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Published on Tue, 11/28/2023 - 19:45

న్యూఢిల్లీ :మణిపూర్‌ హింసలో మృతి చెంది ఎవరూ క్లెయిమ్‌ చేయని మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు అపాయింట్‌ చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మార్చురీల్లో మగ్గుతున్న 175 మృతదేహాల్లో 169 మృతదేహాల వివరాలను గుర్తిచారు. ఆరు అన్‌ఐడెంటిఫైడ్‌గా మిగిలిపోయాయి.169 గుర్తించిన మృతదేహాల్లో 81 బాడీలను కుటుంబ సభ్యులు క్లెయిమ్‌ చేయగా 88 ఎవరూ క్లెయిమ్‌ చేయలేదు. 

మార్చురీల్లో మగ్గిపోతున్న మృతదేహాల పరిస్థితిపై సుప్రీంకోర్టుకు కమిటీ నివేదక ఇచ్చింది.దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్‌ ఆధ్వర్యంలోని బెంచ్‌ విచారణ జరిపింది.క్లెయిమ్‌ చేయని మృతదేహాలను మార్చురీలో నిరవధికంగా ఉంచడం సరికాదని  అభిప్రాయపడింది. 

మృతదేహాలను ఖననం లేదా దహనం చేయడానికిగాను మణిపూర్‌ ప్రభుత్వం 9 ప్రదేశాలను ఎంపిక చేసిందని కోర్టు తెలిపింది.క్లెయిమ్‌ చేసిన మృతదేహాలకు సంబంధించి అంత్యకక్రియలను వారి బంధువులు ఈ 9 ప్రదేశాల్లో ఎక్కడైనా చేసుకోవచ్చని పేర్కొంది.ఇక గుర్తించి క్లెయిమ్‌ చేయని మృతదేహాల అంత్యక్రియల సమాచారాన్ని వారి బంధువులకు తెలపాలని ఆదేశించింది. వారం రోజుల్లోపు ఎవరూ రాకపోతే ప్రభుత్వమే అంత్యక్రియలు చేయొచ్చని తెలిపింది. 

షెడ్యల్‌ తెగల జాబితాలో గిరిజనులు కాని మైతేయి సామాజిక వర్గాన్ని కలిపే విషయాన్ని పరిశీలించాలని హై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ ఏడాది మేలో మణిపూర్‌లో భారీ ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ హింసలో మొత్తం 170 మంది మరణించగా వందల మంది గాయపడ్డారు. 

ఇదీచదవండి..నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు