Breaking News

అభియోగాల సమ్మతిలో తీవ్ర జాప్యంపై సుప్రీం సీరియస్‌

Published on Thu, 10/30/2025 - 06:33

న్యూఢిల్లీ: నేరమయ కేసుల్లో చార్జ్‌షీట్‌ దాఖ లుచేశాక సైతం ట్రయల్‌ కోర్టులు అభియో గాల నమోదుపై తుదినిర్ణయం తీసుకోకపో వడం, దీంతో కేసుల విచారణలో జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. దీంతో క్రిమినల్‌ కేసుల కొండ పేరుకుపోయి న్యాయస్థానాలపై పనిభారం, ఒత్తిడి అత్యంత తీవ్రంగా ఉంటోందని, చివరకు కొన్ని కేసుల విచారణ దశాబ్దాల తరబడి కొనసాగుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 

ఈ నేప థ్యంలో దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో అమలయ్యేలా ఏకరూప నిబంధనావళిని రూ పొందిస్తామని జస్టిస్‌ అరవింద్‌ కుమార్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారి యాల ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ విషయంలో తమకు సహాయకులుగా ఉండాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాలను కోర్టు కోరింది. ‘‘మేం అంతా గమనిస్తున్నాం. సమ యం గడుస్తోందిగానీ ట్రయల్‌ కోర్టుల్లో పద్ధతి మారట్లేదు. 

నిందితులపై పోలీసులు, దర్యాప్తు సంస్థలు నేరాభియోగాలు మోపుతు న్నారు. సంబంధిత ఛార్జ్‌షీట్‌లను ట్రయల్‌ కోర్టులకు సమ ర్పిస్తున్నారు. కానీ ట్రయల్‌ కోర్టులు మాత్రం మూడు, నాలుగేళ్లు గడుస్తున్నా చార్జ్‌షీట్‌లపై తమ నిర్ణయాన్ని ఖరారుచేయట్లేవు. దీంతో విచా రణ మరింత ఆలస్యమవుతోంది. నేరం నమోదుకాకపోతే అసలా కేసులో వాదోపవాదనలు మొదలుకావు. ఇకనైనా కింది కోర్టుల వైఖరి మారేలా దేశవ్యాప్త గైడ్‌లైన్స్‌ ఇవ్వాల్సిందే’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. 

ఈ అంశంలో కోర్టు సహాయకులు(అమికస్‌ క్యూరీ)గా సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రాను ధర్మాసనం నియమించింది. బిహార్‌లో క్రిమినల్‌ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిపై చార్జ్‌షీట్‌ దాఖలై రెండేళ్లు గడుస్తున్నా కిందికోర్టు ఆ నేరాభియోగాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుడి ధోరణి అవలంభిస్తోందని, తన క్లయింట్‌కు న్యాయం చేయాలంటూ ఒక న్యాయవాది చేసిన అభ్యర్థన సందర్భంగా సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది.

 ఈ కేసును రెండు వారాల తర్వాత విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ‘‘మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి ఉంది. 600కుపైగా కేసులో ఇంకా విచారణ కోర్టులు దాఖలైన ఛార్జ్‌షీట్‌లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని మరో న్యాయవాది వాదించారు. భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత చట్టం ప్రకారం సెషన్స్‌ కోర్టులో ఏదైనా కేసు విచారణకు వస్తే చార్జ్‌షీట్‌ దాఖలైన 60 రోజుల్లోపు ఆ నేరాభియోగాలపై సెషన్స్‌ కోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సిందే.

 ‘‘ నేరాన్ని వెంటనే నమోదుచేయని కారణంగా ట్రయల్‌ కోర్టుల్లో క్రిమినల్‌ కేసుల విచారణ ఆలస్య మవుతోంది. సివిల్‌ కేసుల్లో ట్రయల్‌ కోర్టులు ఆయా అంశాలను సరిగా ప్రస్తావించని కారణంగా ఆలస్యమవుతోంది’’అని జస్టిస్‌ కుమార్‌ అన్నారు. మాజీ హైకోర్టు న్యాయమూర్తి, సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నాగముత్తు ఈ అంశంలో కోర్టుకు సహాయకులుగా ఉండాలని సుప్రీంకోర్టు కోరింది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)