Breaking News

రూ.5వేల కోట్లు చెల్లించండి.. సందేసర సోదరులకు సుప్రీం ఆదేశాలు!

Published on Mon, 11/24/2025 - 14:59

న్యూఢిల్లీ: గుజరాత్‌ వ్యాపారవేత్తలు సందేసర సోదరుల ఆర్థిక కుంబకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు బ్యాంకుల వద్ద రుణాల ఎగవేతకు పాల్పడిన సందేసర సోదరులు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అంగీకరించారు. వారి విజ్ఞప్తికి సుప్రీం కోర్టు అంగీకరించింది. డిసెంబర్‌ 17లోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తే వారిపై నమోదైన అన్నీ క్రిమినల్‌ కేసులపై విచారణ నిలిపివేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

నితిన్ సందేసర, చేతన్ సందేసర,దీప్తి సందేసర ఇతర కుటుంబ సభ్యులు స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రమోట్ చేశారు. ఈ సంస్థ భారత్‌తో పాటు, విదేశీ బ్యాంకుల్లో విదేశీ  శాఖల నుంచి రూ.13వేల కోట్లుకు (అంచనా)పైగా రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలను డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించి, బ్యాంకులకు నష్టం కలిగించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ కేసు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్కామ్ కంటే పెద్దదిగా భావించబడుతోంది. పీఎన్‌బీ స్కామ్ (నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ) సుమారు రూ. 13,500 కోట్లుకాగా.. సందేసరా బ్రదర్స్ స్కామ్ రూ. 14,000 కోట్లకు పైగా ఉంది. ఇది భారత బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద మోసాలలో ఒకటిగా పరిగణలో ఉంది.  

స్టెర్లింగ్ బయోటెక్ సంస్థపై పదుల సంఖ్యలో ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే కేసులు నమోదయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరుగుతూ వస్తోంది. ఈక్రమంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లిస్తామని సందేసర సోదరులు ముందుకు వచ్చారు. ఇదే అంశంపై జరిగిన విచారణలో సందేసర సోదరుల విజ్ఞప్తికి సుప్రీం కోర్టు సమ్మతి తెలిపింది. డిసెంబర్ 17 లోగా వారు రుణదాత బ్యాంకులకు రూ.5,100 కోట్ల వన్ టైమ్ సెటిల్‌మెంట్ చెల్లించాలనే షరతు విధించింది.

ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. నితిన్ సందేసర,చేతన్ సందేసర సహ నిందితులపై సీబీఐ,ఈడీ,పీఎంఎల్‌ఎ కింద దాఖలు చేసిన అన్ని కేసులను సెటిల్‌మెంట్ మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత క్రిమినల్‌ విచారణ నిలిపివేస్తామని ఉత్తర్వులో పేర్కొంది. ఆ ఉత్తర్వులో, ప్రజాధనాన్ని తిరిగి పొందడం ప్రాథమిక లక్ష్యం అని బెంచ్ నొక్కి చెప్పింది. మోసం చేసిన మొత్తాన్ని తిరిగి ఇస్తే నేరారోపణలను పొడిగించడం వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)