Breaking News

SC: మాకు అపారమైన అధికారం ఉన్నా సరే..

Published on Mon, 07/10/2023 - 14:52

సాక్షి, ఢిల్లీ: గత రెండు నెలలుగా అల్లర్లు, హింసతో రగిలిపోతున్న మణిపూర్‌ పరిణామాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. న్యాయస్థానాన్ని వేదికగా ఉపయోగించుకొని మరింత ఉద్రిక్తతలు పెంచలేరంటూ పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణకై ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంలో దాఖలైన పలు పిటిషన్లపై.. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది.

శాంతి భద్రతలు తమ పరిధిలోని అంశం కాదని.. అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్‌ పీఎస్‌ నరసింహా ఈ పిటిషన్లను విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కూకీ తెగ తరపున సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గోంజల్వేస్‌ బెంచ్‌ ముందు వాదనలు వినిపిస్తూ.. ‘‘దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని, ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితుల్ని సాధారణ స్థితికి తేవాలని కోరారు. అంతేకాదు ఇది ప్రభుత్వమే జరిపిస్తున్న అల్లర్లంటూ సంచలన ఆరోపణలు చేశారాయన. 

ఈ క్రమంలో చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పందిస్తూ.. మణిపూర్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచడానికి కోర్టును మీరు ఉపయోగించుకోలేరంటూ వ్యాఖ్యానించారాయన. ‘‘అఫ్‌కోర్స్‌.. సుప్రీం కోర్టుకు అపారమైన అధికారమే ఉంది. కానీ, దానిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగిస్తాం. ఒక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మా పని కాదు. అది అక్కడి ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానిదేనని అన్నారు. 

ఇదిలా ఉంటే.. అడ్వొకేట్‌ కోలిన్‌ గోంజల్వేస్‌ మణిపూర్‌లోని బీజేపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయుధ వర్గాలను ప్రభుత్వమే వెన్నుతట్టి ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో మళ్లీ జోక్యం చేసుకున్న సీజేఐ..  ఇది తీవ్ర సంక్షోభమేనని, చేతనైంతలోనే తామ చేసేది చేయగలమని, అంతేగానీ శాంతి భద్రతల పరిరక్షణ మాత్రం పర్యవేక్షించలేమని, అవసరం అనుకుంటే నిర్మాణాత్మక సూచనలతో రావాలని పిటిషనర్ల తరపు అడ్వొకేట్‌కు సూచించారు. ఈ క్రమంలో రేపు(మంగళవారం) మరోసారి పిటిషన్లపై సీజే బెంచ్‌ వాదనలు విననుంది. 

ఇదిలా ఉంటే మే నెల నుంచి ఇప్పటిదాకా.. మణిపూర్‌లో కుకీ-మెయితీ తెగల మధ్య వైరం 150 మంది ప్రాణాలను బలిగొంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఒక నివేదిక సమర్పించాలని మణిపూర్‌ సీఎస్‌ను సుప్రీం కోర్టు  గతవారం ఆదేశించింది. అంతకాదు శరణార్థుల పరిస్థితిపైనా నివేదిక ఇవ్వాలని కోరింది. 

ఇదీ చదవండి: గులా‘బీ టీమ్‌’ గందరగోళం ఎట్లా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)