Breaking News

టీకా వేసుకోవాలని... బలవంతపెట్టలేం: సుప్రీం 

Published on Mon, 05/02/2022 - 11:45

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకోవాల్సిందిగా ఎవరినీ బలవంతపెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ శరీరానికి ఏం కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ప్రతి పౌరునికీ కల్పించిందని పేర్కొంది. సేవలు పొందడానికి టీకాను తప్పనిసరి చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.

వ్యాక్సినేషన్‌ తాలూకు ప్రతికూల ప్రభావాలకు సంబంధించిన వివరాలను, గణాంకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్రానికి సూచించింది. అంతేగాక కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నంత కాలం టీకా తీసుకోని వాళ్లు బహిరంగ స్థలాల్లో స్వేచ్ఛగా తిరగడం, ఇతరత్రా సేవలు పొందడంపై ఆంక్షలు విధించరాదని సూచించింది. అయితే ప్రభుత్వ కరోనా టీకా కార్యక్రమాన్ని సమర్థించింది. అది అసమగ్రంగా ఉందని చెప్పలేమని పేర్కొంది. ప్రజాప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం కొన్ని పరిమితులు కూడా విధించొచ్చని తెలిపింది. పిల్లలకూ కరోనా టీకా వేయించాలన్న కేంద్రం నిర్ణయం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీసుకున్నదేనని అభిప్రాయపడింది.

ఈ విషయంలో కూడా పలు దశల పరీక్షల తాలూకు ఫలితాలను అందరికీ అందుబాటులో ఉంచాలని కేంద్రానికి సూచించింది. కరోనా టీకాలకు సంబంధించి అన్ని వివరాలనూ ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు కేంద్రం తెలిపింది. ‘‘మార్చి 13 నాటికి దేశవ్యాప్తంగా 180 కోట్లకు పైగా డోసులు వేశాం. 15–18 ఏళ్ల వయసు వాళ్లకు 8.91 కోట్ల డోసులు వేశాం. టీకా వల్ల స్వల్ప ఆరోగ్య సమస్యలు వచ్చాయంటూ 1,739, తీవ్ర సమస్యలంటూ 81, అతి తీవ్ర సమస్యలొచ్చాయని 6 కేసులు నమోదయ్యాయి’’ అని వివరించింది.   

Videos

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)