Breaking News

మధ్యవర్తిత్వానికి జాప్యం జాఢ్యం

Published on Mon, 09/22/2025 - 05:58

న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం కూడా ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి ఒకప్పుడు సత్వరమైన ప్రత్యామ్నాయంగా ఉన్న మధ్యవర్తిత్వానికి నేడు మితిమీరిన వాయిదాల జాఢ్యం అంటుకుందని వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వం అంశంలో ప్రపంచంలోనే ప్రముఖంగా నిలవాలని భావిస్తున్న భారత్‌ కేవలం తీర్పుల సంఖ్యతోనే కాదు, ఆ తీర్పుల్లో తార్కికమైన ప్రమాణాలను, నిష్పాక్షికతను ప్రతిబింబించాలన్నారు. 

మధ్యవర్తిత్వ తీర్పుల్లో జాప్యాన్ని నివారించేందుకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాల్సిన నమూనా విధివిధానాలు వంటి సంస్థాగత పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వాయిదాలను కఠినంగా నియంత్రించడం ఈ సమస్యకు ఒక పరిష్కారమని తెలిపారు. మధ్యవర్తిత్వ విధాన సమగ్రతను కాపాడేందుకు క్రమశిక్షణ ఎంతో అవసరమని జస్టిస్‌ సూర్యకాంత్‌ చెప్పారు. వాణిజ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ విధానం నేడు వెన్నెముకగా మారిందని చెప్పారు. 
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)