Breaking News

స్వలింగ బంధాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Published on Thu, 04/20/2023 - 10:51

న్యూఢిల్లీ: స్వలింగ బంధాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘లైంగిక లక్షణాలు, మొగ్గుదలల మీద వ్యక్తులకు అదుపు ఉండదు. అవి స్వతఃసిద్ధమైనవి. కనుక వాటి ప్రాతిపదికన ప్రభుత్వాలు ఎవరి పట్లా వివక్ష చూపజాలవు’’ అని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం రెండో రోజు కూడా వాదనలు కొనసాగాయి. ఈ పిటిషన్లు పట్టణ, ఉన్నత వర్గ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.

స్వలింగ ధోరణి పట్టణ, ఉన్నత వర్గాలకే పరిమితమైనదన్న వాదనను బలపరిచే సాక్ష్యాలేవీ కేంద్రం చూపలేకపోయిందని పేర్కొంది. ‘‘లైంగిక ధోరణి స్వతఃసిద్ధ భావనే తప్ప దానికి సామాజిక, వర్గ ప్రాతిపదికలేవీ ఉండవన్న సీనియర్‌ న్యాయవాది ఎ.ఎం.సింఘ్వి వాదనతో ఏకీభవిస్తున్నాం. స్వేచ్ఛాయుత వాతావరణం కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణులు ఎక్కువగా బయటికి కన్పిస్తుండవచ్చు’’ అని అభిప్రాయపడింది.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే స్త్రీ పురుషుల పెళ్లీడు, దత్తత వంటివాటిపై పడే ప్రభావంతో పాటు తెరపైకి రాగల పలు ఇతర పరిణామాలను కూడా ధర్మాసనం లోతుగా చర్చించింది. ‘స్వలింగ జంట ఆడయినా, మగయినా పిల్లలను దత్తత తీసుకోవచ్చు. పెరిగే క్రమంలో తమ తల్లుల/తండ్రుల లైంగిక ధోరణి తాలూకు ప్రభావం ఆ పిల్లల మనసులపై ఎలా ఉంటుందన్నది ఆలోచించాల్సిన అంశమే’’ అని అభిప్రాయపడింది.

పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకే
సుప్రీంకోర్టే చొరవ తీసుకుని స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ విజ్ఞప్తి చేశారు. 142వ అధికరణ కింద రాజ్యాంగం కల్పిచిన ప్లీనరీ అధికారాలను వినియోగిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ‘‘అత్యున్నత న్యాయస్థానికి ఉన్న ప్రతిష్ట, నైతికత దృష్ట్యా సమాజమూ ఈ నిర్ణయాన్ని అంగీకరించి స్వలింగ వివాహాలను ఆమోదిస్తుందన్న విశ్వాసముంది. తద్వారా వారూ సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపగలరు. వితంతు వివాహాలకూ తొలుత సామాజిక ఆమోదం లేదు. కానీ చట్టం చేశాక ఆమోదం లభించింది’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు.

కేసులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ప్రతివాదులుగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో కేంద్రం తాజాగా తాజా అఫిడవిట్‌ దాఖలు చేసింది. స్వలింగ వివాహాలపై వైఖరి తెలపాల్సిందిగా రాష్ట్రాలకు లేఖ రాశామని, వాటి అభిప్రాయాలతో నివేదిక సమర్పించేందుకు అనుమతించాలని కోరింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)