Breaking News

లంబాడీల ఎస్టీ హోదాపై సుప్రీంలో విచారణ

Published on Sat, 09/20/2025 - 01:36

సాక్షి, న్యూఢిల్లీ: బంజారా, లంబాడీ, సుగాలీ కులాలను షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. జస్టిస్‌ జె.కె. మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.

పిటిషనర్లు పోడియం బాలరాజు, మోడి యం శ్రీనివాసరావు సహా మరో ఇద్దరి తరఫున సీనియర్‌ న్యాయవాది పరమేశ్వరన్‌తో పాటు న్యాయవాదులు అల్లంకి రమేశ్, ఉండవల్లి అరుణ్‌ కుమార్, ఆర్‌.మమత వాదనలు వినిపించారు. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342కు పూర్తిగా విరుద్ధమని వారు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అసలైన ఆదివాసీ తెగలతో పోలిస్తే ఈ వర్గాలు ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగాఅభివృద్ధి చెందాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రధాన పిటిషన్లతో ఈ వ్యాజ్యాలను జత చేయా లని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)