‘వక్ఫ్‌’ పిటిషన్లపై  16న సుప్రీం విచారణ

Published on Fri, 04/11/2025 - 04:59

సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్‌(సవరణ)చట్టం–2025 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సహా దాఖలు చేసిన 10 వరకు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుందని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌ ఉంటారు. ఒవైసీతోపాటు ఆప్‌ నేత అమానతుల్లా ఖాన్, అసోసియేషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ అర్షద్‌ మదానీ, సమస్త కేరళ జమియతుల్‌ ఉలెమా, అంజుమ్‌ కదారి, తయ్యబ్‌ ఖాన్‌ సల్మానీ, మహ్మద్‌ షఫీ, మహ్మద్‌ ఫజలుర్రహీమ్, ఆర్‌జేడీ నేత మనోజ్‌ కుమార్‌ ఝా పిటిషన్లు వేశారు.

 ఈ చట్టంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా ముందుగా తమ వాదనను వినాలంటూ ఈ నెల 8న కేంద్రం సుప్రీంకోర్టులో కెవియెట్‌ దాఖలు చేయడం తెల్సిందే. పార్లమెంట్‌ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముర్ము సంతకం చేయడంతో వక్ఫ్‌(సవరణ) చట్టం–2025ను గురువారం నోటిఫై చేసింది. తీవ్ర వ్యతిరేకత నడుమ పార్లమెంట్‌ ఆమోదం పొందిన ఈ చట్టంతో తమిళనాడులోని 50 లక్షల మందితోపాటు దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింల హక్కులకు భంగం వాటిల్లనుందని పిటిషనర్లలో ఒకటైన డీఎంకే అంటోంది. ఈ చట్టంలోని అంశాలు ఏకపక్షంగా, ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ (ఏఐఎంపీఎల్‌బీ) అంటోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)