Breaking News

ఈసీల నియామకం.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Published on Wed, 03/13/2024 - 12:35

న్యూఢిల్లీ: కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌)అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం(మార్చ్‌ 15) విచారించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే రిటైర్‌ అవడం, ఇటీవలే మరో ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌గోయెల్‌ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.

ఈ రెండు ఖాళీలను నింపేందుకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఈ వారంలోనే సమావేశమవనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడీఆర్‌ వేసిన పిటిషన్‌ను లిస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా(సీజేఐ) కమిటీలో సభ్యుడిగా ఉండగా కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి అవకాశం కల్పించారు. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఈసీలను కేంద్రం ఎంపిక చేస్తుండటంతో ఏడీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.  

కాగా, లోక్‌సభ ఎన్నిలకు త్వరలో షెడ్యూల్‌ వెలువడనుండగా ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌గోయెల్‌ ఇటీవల ఆకస్మికంగా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. సీఈసీతో ఉన్న విభేదాల కారణంగానే గోయెల్‌ తన పదవికి రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది. అరుణ్‌గోయెల్‌ ఆకస్మిక రాజీనామాతో ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. 

ఇదీ చదవండి.. ఈసీ కసరత్తులు చివరికి ఎల్లుండే షెడ్యూల్‌ 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)