Breaking News

ఇదెక్కడి బుల్డోజర్‌ న్యాయం?

Published on Tue, 09/03/2024 - 04:17

సాక్షి, న్యూఢిల్లీ: బుల్డోజర్‌ న్యాయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఓ వ్యక్తి నిందితుడు అయినంత మాత్రాన∙అతడి ఇల్లు కూల్చేస్తారా? అని నిలదీసింది. పలు రాష్ట్రాల్లోని బుల్డోజర్‌ సంస్కృతిపై అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్‌ కేసుల్లో నిందితులైన వారి ఇళ్లను కొన్ని రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 

సమస్యలు పరిష్కరించడానికి బుల్డోజర్‌ న్యాయం సరికాదని,  ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంది. ‘నిందితుడైనంత మాత్రాన అతని ఇల్లు కూల్చేస్తారా? ఒకవేళ అతన్ని దోషిగా న్యాయస్థానం తేలి్చనా.. ఇల్లు కూల్చడానికి వీల్లేదు. దానికి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

 పలు రాష్ట్రాల్లో ఇళ్ల కూలి్చవేతపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సోమవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కేవీ విశ్వనా«థన్‌ల ధర్మాసనం విచారించింది. ‘‘ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఇల్లు ఎందుకు కూల్చివేయాలి. దోషి అయినప్పటికీ ఇల్లు కూలి్చవేయలేం’’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. దీంతోపాటు అనధికార నిర్మాణాలను, ఆక్రమణలను కోర్టు రక్షించదని, అయితే వీటికి కొన్ని మార్గదర్శకాలు అవసరమని పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు అందజేయాలని ఇరుపక్షాలను ధర్మాసనం కోరింది. ఆయా ప్రతిపాదనలు సీనియర్‌ న్యాయవాది నచికేత జోషికి సమరి్పంచాలని, వాటిని క్రోడీకరించి కోర్టుకు అందజేయాలని సూచించింది. నిందితుల స్థిరాస్తుల ధ్వంసాన్ని అడ్డుకోవడానికి తాము అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపింది.  

రోడ్లను ఆక్రమిస్తే గుడులైనా వదలం.. 
ఏదైనా నేరంలో ప్రమేయం ఉన్నంత మాత్రాన.. అతని స్థిరాస్తి కూల్చివేతకు అది భూమిక కాబోదని ఇదివరకే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో  స్పష్టం చేశామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విన్నవించారు. మున్సిపల్‌ నిబంధనలను లేదా అక్కడి ప్రాధికార సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తేనే.. కూలి్చవేతలు ఉంటాయని అందులో స్పష్టం చేశామని యూపీ తరఫున హాజరైన మెహతా తెలిపారు. 

యజమాని క్రిమినల్‌ కేసుల్లో నిందితుడనే కారణంతో ఏ స్థిరాస్తిని కూలి్చవేయబోమన్నారు. ‘మీరు ఇదే వాదనకు కట్టుబడి ఉన్నామంటే.. మేము దీన్ని రికార్డు చేసుకుంటాం. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేస్తాం. రహదారులపై ఎలాంటి ఆక్రమ నిర్మాణాన్ని, ఆక్రమణలనూ మేము రక్షించబోవడం లేదు. రహదారులపై గుడులున్నా వదిలిపెట్టబోం’ అని ధర్మాసనం పేర్కొంది. ‘కూ లి్చవేతలు చట్టానికి లోబడి ఉండాలి. కానీ చట్టాన్ని అతిక్రమించి జరగడమే చూస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 17కు వాయిదా వేసింది.    
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)