Breaking News

‘బార్‌ కౌన్సిల్‌’లో మహిళలకు 30% కోటా

Published on Fri, 12/19/2025 - 06:07

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మహిళా న్యాయ వాదులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ, ఏపీ బార్‌ కౌన్సిళ్లలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కచి్చతంగా అమలు చేయాల్సిందేనని తేలి్చచెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగి్చలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌లోనే ఈ రిజర్వేషన్‌ అంశాన్ని స్పష్టంగా పొందుపరచాలని కోర్టు ఆదేశించింది.

దేశవ్యాప్తంగా బార్‌ కౌన్సిళ్లలో మహిళలకు 1/3 వంతు ప్రాతినిధ్యం కోరుతూ న్యాయవాది యోగమయ, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 8న కోర్టు తీర్పునిచి్చంది. ఎన్నికల ప్రక్రియ మొదలుకాని చోట 30 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని సూచించింది. ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నోటిఫికేషన్‌ విడుదల కాలేదని, కాబట్టి ఇక్కడ కూడా మహిళా రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరుతూ సునీత, సుభాíÙణి గుడిమల్ల సహా మరికొందరు మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. వారి పిటిషన్లను సీజేఐ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించి, పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. 

ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ..  
విచారణ సందర్భంగా తెలంగాణలో నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందని సీజేఐ ప్రశ్నించగా.. శుక్రవారమే వస్తుందని న్యాయవాదులు బదులిచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌.. ‘తెలంగాణ ఒక ప్రగతిశీల రాష్ట్రం. అక్కడ మహిళా రిజర్వేషన్ల అమలులో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు. ఇవే ఆదేశాలు ఏపీకి కూడా వర్తిస్తాయని, గతంలో ఇచి్చన ఉత్తర్వులను సవరిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఎన్నికల్లో పోటీకి తగినంత మంది మహిళా న్యాయవాదులు లేకపోతే.. 20 శాతం సీట్లను పోటీకి కేటాయించి, మిగిలిన 10 శాతం సీట్లకు మహిళలను కో–ఆప్ట్‌ (నామినేట్‌) చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)