Breaking News

జనానికి తాగునీరే లేదు.. సైకిల్‌ ట్రాక్‌లు కావాలా!

Published on Tue, 02/11/2025 - 05:47

న్యూఢిల్లీ: ప్రజలందరికీ గృహ వసతి, తాగునీటి వసతి కల్పించడానికి సరిపడా నిధుల్లేక రాష్ట్రాలు ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే సైకిల్‌ ట్రాక్‌లంటూ కొందరు పగటి కలలు కంటున్నారంటూ సుప్రీంకోర్టు మండిపడింది. దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా సైకిల్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. సోమవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకాల ధర్మాసనం పిల్‌పై విచారణ చేపట్టింది. ‘మురికి వాడలకు వెళ్లండి అక్కడ జనం ఏ పరిస్థితిలో ఉంటున్నారో చూడండి. వారికి సరైన గృహ వసతి కల్పించేందుకు రాష్ట్రాల వద్ద నిధుల్లేవు. ప్రజలకు కనీసం వసతులు కల్పించాలి. 

మనమేమో ఇక్కడ సైకిల్‌ ట్రాక్‌లు ఉండాల్సిందేనంటూ పగటి కలలు కంటున్నాం’అని వ్యాఖ్యానించింది. ‘మనవి తప్పుడు ప్రాధాన్యతలు. మన ప్రాధాన్యతలను సరి చేసుకోవాల్సి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 అమలు విషయం మనం ఆలోచించాలి. ప్రజలకు తాగేందుకు మంచి నీరు లేదు. ప్రభుత్వ బడులు మూతబడుతున్నాయి. మీరేమో సైకిల్‌ ట్రాక్‌లు కావాలంటున్నారు’అని పేర్కొంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సైకిల్‌ ట్రాక్‌లున్నాయని, దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలంటూ సైక్లింగ్‌ ప్రోత్సాహకుడు దేవీందర్‌ సింగ్‌ నేగి తన పిటిషన్‌లో కోరారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)