Breaking News

సినిమా పేరు మార్చండి.. లేదా రిలీజ్‌ చేయకండి!

Published on Fri, 02/13/2026 - 00:57

న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ‘ఘూస్‌ఖోర్‌ పండట్‌’సినిమా టైటిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ కులాన్ని లేదా వర్గాన్ని కించపరచ లేరని స్పష్టం చేసింది. ఆ పేరును మార్చేదాకా సినిమాను విడుదల చేయవద్దంటూ ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖకు, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సరి్టఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)కి, సినిమా నిర్మాత నీరజ్‌ పాండేకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. 

ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి నటించిన ‘ఘూస్‌ఖోర్‌ పండట్‌’సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇటీవల ప్రకటించారు. అయితే, సినిమా టైటిల్‌ తమ వర్గం ప్రజలను కించపరిచేలా ఉందంటూ బ్రాహ్మణ్‌ సమాజ్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్‌ ఆర్గనైజేషన్‌ సెక్రటరీ అతుల్‌ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలపై స్టే విధించాలంటూ ఆయన పిల్‌ వేశారు. 

సినిమా పేరుతోపాటు కథాంశం బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉందని ఆయన ఆరోపించారు. కులాన్ని, మతాన్ని సూచించే పండిత్‌ అనే పదాన్ని, అవినీతిని సూచించే ’ఘూస్‌ఖోర్‌(లంచగొండి)’తో కలిపి వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్‌పై గురువారం జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

 ‘జాగృతం చేయడం, ప్రజలను కించపరుస్తూ అశాంతిని సృష్టించడం అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఇప్పటికే ఉన్న విభేదాలు చాలవన్నట్లు, మీరు కొత్తగా ఇలాంటి వాటితో మరింతగా అలజడులను ఎందుకు సృష్టిస్తున్నారు’అంటూ నిర్మాతపై మండిపడింది. ‘రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్యాన్ని మేం గౌరవిస్తున్నాం. అదే సమయంలో దానికీ హద్దులున్నాయి. మీరు ఎవరినైనా ఎందుకు కించపర్చాలి? ఇటువంటి పేరుపెట్టి ఓ వర్గం వారిని ఎందుకు తక్కువ చేయాలని చూస్తున్నారు?’అని ప్రశ్నించింది. ‘దీనిని భావ ప్రకటన స్వేచ్ఛగా భావించలేం. ఆ హక్కు ఇతరులను కించపరిచేందుకు ఇచి్చన లైసెన్సు కాదు.

 ఇలాంటివి నైతికతకు, సమాజానికి వ్యతిరేకం. పేరు మార్చకుండా సినిమాను విడుదల చేయడానికి మేం అనుమతించం. సినీ నిర్మాతలు, జర్నలిస్టులు తదితరులు ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నాం’అని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా, చిత్రనిర్మాత తరపు న్యాయవాది.. కొత్త టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా టైటిల్‌ను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు. సినిమా టైటిల్‌ వివాదంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా..ఆ పేరును మారుస్తామంటూ నెట్‌ఫ్లిక్స్‌ హామీ ఇచ్చింది. కథాంశాన్ని, ఉద్దేశాన్ని ప్రతిబించేలా మరో పేరు పెడతామంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)