పత్రికల్లో పేరు కోసం పిటిషన్లా?

Published on Sat, 05/17/2025 - 04:11

న్యూఢిల్లీ: వక్ఫ్‌(సవరణ) చట్టం–2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఇక కొత్తగా పిటిషన్లు దాఖలైతే విచారణకు స్వీకరించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు కుండబద్ధలు కొట్టినట్లు తేల్చిచెప్పింది. పత్రికల్లో పేరు కోసం కొందరు ఇష్టానుసారంగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పత్రికల్లో పేరు రావాలని కోరుకుంటున్నారని, అందుకే పిటిషన్లు అంటూ తమ సమయం వృథా చేస్తున్నారని మండిపడింది. మీడియాలో పబ్లిసిటీ కోసం కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడం ఏమిటని నిలదీసింది. 

వక్ఫ్‌(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగా రెండు వ్యాజ్యాలు దాఖలు కాగా, వాటిని విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. ఆ రెండు పిటిషన్లను డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై ఈ నెల 20న విచారణ చేపట్టనున్నట్లు తెలియజేసింది. వక్ఫ్‌(సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ లెక్కలేనన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కొత్తగా ఎవరూ వ్యాజ్యాలు దాఖలు చేయొద్దని పరోక్షంగా హెచ్చరించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)