Breaking News

ఉచితాలు కాదు..  ఉద్యోగావకాశాలు కల్పించండి

Published on Fri, 02/20/2026 - 04:08

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉచిత పథకాల సంస్కృతిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఉచితాలు కాదు.. ఉద్యోగావకాలు కల్పించాలని సూచించింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. కేంద్రం, ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

 ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్‌ అందించాలనే డీఎంకే ప్రతిపాదనపై తమిళనాడు విద్యుత్‌ పంపిణీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వేసిన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం పంఛోలిలతో కూడిన  సుప్రీంకోరు ధర్మాసనం విచారించింది.

 అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేయడానికి బదులుగా ఇలా ఉచితాలు పంపిణీ చేస్తే ఎలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉచిత పంపిణీలతో దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, అందరికీ ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్‌ ఇవ్వడానికి బదులుగా రాష్ట్రాలు ఉపాధి కోసం మార్గాలను తెరవడానికి కృషి చేయాలని ధర్మాసనం పేర్కొంది. 

‘దేశంలో మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? విద్యుత్‌ ఛార్జీలు చెల్లించలేని వారికి సంక్షేమ చర్యలో భాగంగా మీరు అందించాలనుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ భరించగల వారికి, భరించలేని వారికి మధ్య తేడాను గుర్తించకుండా, అందరికీ పంపిణీ చేయడం ఎలాంటి విధానం?’ అని చీఫ్‌ జస్టిస్‌ ప్రశ్నించారు. ‘రాష్ట్రాలు ఉపాధి కోసం మార్గాలను తెరవడానికి కృషి చేయాలి. ఉచిత ఆహారం, ఆపై ఉచిత సైకిల్, తర్వాత ఉచిత విద్యుత్‌ ఇస్తూ పోతే, ఆపై ఎవరు పని చేస్తారు. అసలు పని సంస్కృతి ఏమైపోతుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.   
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)