Breaking News

Supreme Court: మా విశ్వాసం చెదిరిపోతోంది

Published on Mon, 09/16/2024 - 04:48

న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో జైలు శిక్ష పడిన దోషులను శిక్షాకాలం ముగియకముందే కారాగారం నుంచి బయటకు రప్పించడానికి న్యాయవాదులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టు ముందు పదేపదే తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించింది. దోషులకు శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్లలోనూ అసత్య సమాచారం చేరుస్తున్నారని విమర్శించింది.

 ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు తమ విశ్వాసం చెదిరిపోతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి మాసీతో కూడిన ధర్మాసనం ఈ నెల 10వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తాజాగా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఖైదీల రెమిషన్‌ విషయంలో లాయర్ల తప్పుడు స్టేట్‌మెంట్లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడు వారాలుగా ఇలాంటి కేసులను పెండింగ్‌లో పెట్టాం. పరి్మనెంట్‌ రెమిషన్‌ మంజూరు చేయడం లేదు. అయినా ఇందుకోసం భారీగా తప్పుడు పిటిషన్లు దాఖలవుతున్నాయి’’ అని ధర్మాసనం ఆగ్రహించింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)