డిజిటల్‌ అరెస్ట్‌లపై సీబీఐ విచారణ 

Published on Tue, 10/28/2025 - 06:34

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నేరాలపై ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని తమకు తెలపాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌ 3వ తేదీకల్లా పూర్తి వివరాలు పంపాలని, సీబీఐ దర్యాప్తును సమీక్షిస్తామని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగీ్చల ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. గత విచారణ సందర్భంగా తమకు పూర్తి వివరాలు తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులిచి్చంది. ఈ కేసును సోమవారం జస్టిస్‌ జస్టిస్‌ సూర్యకాంత్, జాయ్‌మాల్య బాగీ్చల ధర్మాసనం విచారించింది.  

ఎఫ్‌ఐఆర్‌ వివరాలను అందించండి 
దేశంలో జరుగుతున్న సైబర్‌ మోసాలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను నవంబర్‌ 3వ తేదీన చేపట్టే తదుపరి విచారణ నాటికి అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా జరిగిన విచారణ, దర్యాప్తు పురోగతి వంటి అంశాలను వివరించాలని కోరింది. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మోసాలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తమను డిజిటల్‌ అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఆదేశాల ఫోర్జరీ పత్రాలను చూపి, భయపెట్టి రూ.1.05 కోట్లు కాజేశారంటూ హరియాణాకు చెందిన వృద్ద దంపతులు 
సెపె్టంబర్‌ 21న సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌కి లేఖ రాశారు. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడం తెల్సిందే. 

సమన్వయం అవసరం 
సైబర్‌ నేరాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టాలంటే కేంద్ర, రాష్ట్రాల దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం అవసరముందని జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. ‘హోం శాఖ, సైబర్‌ క్రైం విభాగం సహకారంతో సీబీఐ ఇప్పటికే పలు కేసులను విచారిస్తోంది’అని సొలిసిటర్‌ జనరల్‌ తుషా ర్‌ మెహతా ధర్మాసనానికి తెలిపారు.

 ‘ఈ కుంభకోణం ప్రత్యేక విచారణ బాధ్యతలు చేపట్టేందుకు సీబీఐ సిద్ధంగా ఉందా? అందుకు అవసరమైన అదనపు వ్యయం ఏమిటి?‘అని జస్టిస్‌ బాగ్చీ తుషార్‌ మెహతాను అడిగారు. ‘సైబర్‌ నేరాలలో నిపుణులు అవసరమైతే, వారు మాకు చెప్పవచ్చు’అంటూ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నా రు. దేశంతోపాటు మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి కూడా ఇవి జరుగుతున్నందున వీటిపైనా విచార ణ చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికతో తదుపరి విచారణ సమయానికి సీబీఐ ముందుకు రావాలని కోరారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)