Breaking News

మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?.. యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Published on Tue, 02/18/2025 - 11:56

న్యూఢిల్లీ: పబ్లిక్‌గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. పాపులారిటీ కోసం అంత అసభ్య భాష మాట్లాడతారా? అంటూ మండిపడింది. ‘ఇండియాస్‌ గాట్‌ లేటెంట్‌’ షోలో అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అతని వికృతమైన, చెత్త మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు అలాంటి భాష ఎవరైనా మాట్లాడతారా అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

‘ఇండియాస్‌ గాట్‌ లేటెంట్‌’ షోలో తాను చేసిన వ్యాఖ్యలపై వేరు వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులను కలిపి విచారించేలా ఆదేశాలివ్వాలని అల్హాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను మంగళవారం(ఫిబ్రవరి 18) జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌.కోటిశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. 

ఈ సందర్భంగా న్యాయమూర్తులు అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బుర్రలో ఇంత చెత్త ఉందా అని తీవ్రంగా మందలించారు. కొంత కాలం పాటు ఎలాంటి షోలలో పాల్గొనరాదని అల్హాబాదియాను ఆదేశించారు. అయితే వ్యాఖ్యలకుగాను నమోదైన కేసుల్లో అల్హాబాదియాకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ కేసుల్లో అతడిని అరెస్టు చేయకుండా స్టే విధించింది.  బీర్‌బైసెప్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా పాలపులర్‌ అయిన అల్హాబాదియా అతని స్నేహితుడు సమయ్‌ రైనాషోలో పాల్గొన్నప్పుడు నోరు జారారు. 

అతని అశ్లీల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.ఏకంగా మహారాషష్ట్ర,అస్సాం సీఎంలు ఈ విషయమై స్పందించారంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. 

యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌పై కేంద్రానికి నోటీసులు..

యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రణ్‌వీర్‌ అల్హాబాదియా కేసు విచారణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిబంధనలేవైనా రూపొందిస్తే తాము సంతోషిస్తామని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)