Breaking News

ప్రజల నమ్మకాన్ని చెత్త బుట్టలో పడేశారు

Published on Thu, 03/07/2024 - 05:45

న్యూఢిల్లీ: దేశంలో ప్రఖ్యాతిగాంచిన జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో అడవి మధ్యలో టైగర్‌ సఫారీల ఏర్పాటును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. వాటి కార్యకలాపాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సఫారీల ఏర్పాటు కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు అక్కడి భారీ వృక్షాలను నరికివేయడంపై మండిపడింది.

అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనువుగా నిబంధనలను తుంగలో తొక్కిన 2021లో బీజేపీ ప్రభుత్వహయాంలో నాటి ఉత్తరాఖండ్‌ అటవీ మంత్రి హరక్‌ సింగ్‌ రావత్, నాటి డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కిషన్‌ చంద్‌ల పనితీరును తీవ్రంగా ఆక్షేపించింది. ‘‘ ప్రజా విశ్వాసాన్ని బుట్టదాఖలుచేశారు. ఇంతటి విపరీత నిర్ణయాలు కేవలం ఇద్దరే తీసుకున్నారని అనుకోవట్లేము.

ఇందులో చాలా మంది ప్రమేయం ఉండొచ్చు’’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని పీకే మిశ్రా, జస్టిస్‌ సందీప్‌ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాతీయవనంలోని ల్యాన్‌డౌన్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో పఖ్రో టైగర్‌ సఫారీ కోసం వేల చెట్లు నరికేశారంటూ పర్యావరణవేత్త, న్యాయవాది గౌరవ్‌ భన్సల్‌ వేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ‘‘ అధికారి కిషన్‌ను సస్పెండ్‌ చేయాలని అటవీ కార్యదర్శి చేసిన సిఫార్సును రావత్‌ పెడచెవిన పెట్టారు. పైగా కిషన్‌ను సమరి్ధంచారు.

రావత్‌ ఆ పదవి నుంచి దిగిపోయాయే కిషన్‌ సస్ఫెన్షన్, అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన రాజకీయనేతలు, ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కలిసి చేస్తున్న అక్రమాలకు ప్రబల సాక్ష్యం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఈ ఉదంతంపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటనపై సీబీఐ సమగ్ర నివేదిక మూడు నెలల్లో సమరి్పంచాలి. తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. జిమ్‌ కార్బైట్‌ నేషనల్‌ పార్క్‌ రాయల్‌ బెంగాల్‌ పులులకు ఆవాసం. 1,288.31 చదరపు కి.మీ.లోని ఈ అటవీప్రాంతం పేరు. అత్యంత ఎక్కువ సంఖ్యలో పులులు సంచరించే ప్రాంతంగా ప్రపంచ ప్రసిద్దిగాంచింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)