Breaking News

విక్ర‌మ్ మిస్రీపై ట్రోల్స్‌.. తిప్పి కొట్టిన ప్ర‌ముఖులు

Published on Mon, 05/12/2025 - 17:27

పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో భార‌త్ విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్రీ (Vikram Misri) ప్ర‌తిరోజు మీడియా ముందుకు వ‌స్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను, మ‌న సైన్యం చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నారు. భార‌త్- పాక్ కాల్పుల విర‌మ‌ణ గురించి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ శ‌నివారం సాయంత్రం ఎక్స్ ద్వారా వెల్ల‌డించారు. భార‌త్ త‌ర‌పున విక్ర‌మ్ మిస్రీ దీన్ని అధికారికంగా ధ్రువీక‌రిస్తూ ప్ర‌క‌ట‌న చేశారు. ఆ మ‌రుక్ష‌ణం నుంచే ఆయ‌నపై ట్రోలింగ్ మొద‌లైంది. అక్క‌డితో ఆగ‌కుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా ప‌రుష‌ ప‌ద‌జాలంతో దూషిస్తూ పోస్ట్‌లు పెట్టారు. కుట్ర‌దారు, దేశ‌ద్రోహి అంటూ ఆయ‌నపై విరుచుకుప‌డ్డారు. మిస్రీ కుమార్తె పౌర‌స‌త్వాన్ని ప్ర‌శ్నిస్తూ కొంత మంది పోస్ట్‌లు పెట్టారు.

మిస్రీ బాస‌ట‌గా ఒవైసీ
విక్ర‌మ్ మిస్రీ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై ట్రోలింగ్‌ను ఖండిస్తూ ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, ఉన్న‌తాధికారులు బాస‌ట‌గా నిలిచారు. విక్ర‌మ్ మిస్రీపై ట్రోలింగ్‌ను ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) ఖండించారు. ఆయ‌న నిజాయితీప‌రుడైన మంచి అధికారి అని, దేశంలో కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. అధికారులు ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు న‌డుచుకుంటార‌ని, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు అధికారుల‌ను నిందించ‌డం త‌గ‌ద‌ని హిత‌వు చెప్పారు.

చ‌ర్య‌లు తీసుకోరా?
మిస్రీకి కేంద్ర స‌ర్కారు బాస‌ట‌గా నిల‌బ‌డ‌లేద‌ని, ఆయ‌న గౌర‌వాన్ని కాపాడ‌టానికి ఎటువంటి ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ (akhilesh yadav) నిందించారు. మిస్రీపై ట్రోలింగ్‌కు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు బీజేపీ స‌ర్కారు ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని ఆరోపించారు. అధికారులు.. ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌లకు చేరే సంధానక‌ర్త‌లు మాత్ర‌మేనని ఆయ‌న గుర్తు చేశారు. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత,  అధికారులు వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాలు తీసుకోలేర‌ని అఖిలేశ్ అన్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు స‌ల్మాన్ ఖుర్షీద్‌, శ‌శిథ‌రూర్‌, స‌ల్మాన్ అనీస్ సోజ్ కూడా మిస్రీపై ట్రోలింగ్‌ను ఖండించారు. 

ట్రోలింగ్ సిగ్గుచేటు
విదేశాంగ మాజీ కార్య‌ద‌ర్శి నిరుప‌మ మీన‌న్ రావు కూడా మిస్రీకి అండ‌గా నిలిచారు. మిస్రీ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై ట్రోలింగ్ పాల్ప‌డ‌టం సిగ్గుచేటు అన్నారు. అంకితభావం కలిగిన దౌత్యవేత్త అయిన మిస్రీ.. మ‌న దేశానికి వృత్తి నైపుణ్యం, దృఢ సంకల్పంతో సేవ చేశార‌ని ప్ర‌శంసించారు. ఆయ‌న దూషించడానికి ఎటువంటి కారణం లేదన్నారు. హ‌ద్దులు దాటి దూష‌ణ‌ల‌కు పాల్పడ‌టం స‌రికాద‌న్నారు. ద్వేషంతో విషపూరితంగా చేసే వ్యాఖ్య‌లు ఆగిపోవాలి. మన దౌత్యవేత్తలకు భ‌రోసా క‌ల్పించేందుకు వారికి మ‌నమంతా అండ‌గా నిలబడాలని పిలుపునిచ్చారు.

బాధ్యతారహిత చర్య
మిస్రీ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై సోష‌ల్ మీడియాలో విషం క‌క్క‌డాన్ని జాతీయ మ‌హిళా సంఘం (ఎన్‌సీడ‌బ్ల్యూ) తీవ్రంగా ఖండించింది. మిస్రీ కుమార్తెకు సంబంధించిన వ్య‌క్తిగ‌త‌ వివ‌రాల‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయ‌డంపై ఎన్‌సీడ‌బ్ల్యూ చీఫ్ విజయ రహత్కర్ ఫైర్ అయ్యారు. ఇది  వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించే బాధ్యతారహిత చర్య అని పేర్కొన్నారు. ట్రోలింగ్ నేప‌థ్యంలో త‌న ఎక్స్ ఖాతాను లాక్ చేశారు విక్ర‌మ్ మిస్రీ. త‌న పోస్ట్‌ల‌ను ఎవ‌రూ చూడ‌కుండా నియంత్ర‌ణ విధించారు. 

చ‌ద‌వండి: విక్ర‌మ్ మిస్రీపై ట్రోల్స్‌.. కాంగ్రెస్ నేత‌ శ‌శి థ‌రూర్ కౌంట‌ర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)