Breaking News

‘తుఫాన్ వారియర్’గా మోహన్‌లాల్

Published on Thu, 06/18/2026 - 12:30

తిరువనంతపురం: కేరళలో మత్తుపదార్థాల మహమ్మారిని అంతమొందించేందుకు కేరళ పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాంటీ-డ్రగ్ డ్రైవ్ ‘ఆపరేషన్ తుఫాన్’ సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. మత్తు ముఠాల గుండెల్లో వణుకు పుట్టిస్తూ సాగుతున్న ఈ మహా యుద్ధంలోకి మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ స్వయంగా అడుగుపెట్టారు. తాను కూడా ఒక ‘తుఫాన్ వారియర్’గా మారుతున్నట్లు ప్రకటిస్తూ, కేరళ పోలీస్ విభాగానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.

డ్రగ్స్ మాఫియాపై మహా యుద్ధం
‘ఆపరేషన్ తుఫాన్ - ద నార్కో హంట్’ పేరుతో కేరళలో సాగుతున్న ఈ భారీ ఆపరేషన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మోహన్‌లాల్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నెట్‌వర్క్‌ను సమూలంగా పాతరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ పోరాటంలో తాను భాగం కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తుడిచిపెట్టేందుకు కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితలతో మోహన్‌లాల్ ప్రత్యేకంగా సమావేశమై, ఈ పోరాటం కేరళ భవిష్యత్తుకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.

హోంమంత్రితో భేటీ.. 
ఈ భేటీ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఇలాంటి  చర్యలు చేపట్టాలని తాను ఎన్నేళ్లుగానో కోరుకుంటున్నానని హోంమంత్రి రమేష్ చెన్నితలకు వివరించారు. ఈ ప్రచారాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని, దీనివల్ల వేలాది కుటుంబాలు, విద్యార్థుల జీవితాలు నిలబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఒక ‘తుఫాన్’లాగా మారి డ్రగ్స్ మాఫియాను తుడిచిపెట్టేయాలని ఆయన కోరుకున్నారు. ఇదే సమయంలో విశ్వశాంతి ఫౌండేషన్ తరపున తాము రూపొందించిన 'బీ ఏ హీరో, సే నో టు డ్రగ్స్' ప్రాజెక్ట్ వివరాలను హోంమంత్రికి  తెలియజేస్తూ, పోలీసులకు ఎలాంటి సహాయం చేయడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: ధరలు తగ్గించడం కుదరదు: సురేష్ గోపి

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)