Breaking News

ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆచూకీ చెబితే రూ. 50 వేలు!

Published on Mon, 12/11/2023 - 08:47

బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.  అయితే పంజాబ్‌లో ఆయన అదృశ్యం అయ్యారంటూ పోస్టర్లు వెలిశాయి. అంతే కాదు సన్నీ డియోల్‌ ఆచూకీ చెప్పినవారికి రూ.50 వేలు రివార్డు కూడా ప్రకటించారు. సన్నీ డియోల్ అదృశ్యమయ్యారంటూ పోస్టర్లు వేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నిజానికి సన్నీ డియోల్ గురుదాస్‌పూర్-పఠాన్‌కోట్ లోక్‌సభ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ. సన్నీడియోల్ ఎంపీ అయినప్పటి​కీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పఠాన్‌కోట్ జిల్లాలోని హల్కా భోవాకు చెందిన జనం సర్నా బస్టాండ్‌లో సన్నీ డియోల్ అదృశ్యంపై పోస్టర్లపై అతికించి, అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జిల్లాలోని హల్కా, పఠాన్‌కోట్, సుజన్‌పూర్‌లలో సన్నీ డియోల్ అదృశ్యానికి సంబంధించిన పోస్టర్‌లు కనిపించాయి. ఇంత జరుగుతున్నా సదరు ఎంపీ స్థానికుల బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తన లోక్‌సభ నియోజకవర్గానికి ఎప్పుడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఈ నేపధ్యంలో నిరసనకు దిగిన జనం బస్సులకు ఈ పోస్టర్లను అతికించారు.

ఎంపీగా ఎన్నికయిన తర్వాత సన్నీ డియోల్ తన లోక్‌సభ నియోజకవర్గానికి ఏనాడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. ప్రజలను మోసం చేయడంలో సన్నీ డియోల్ విజయం సాధించారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డు ఇస్తామని నిరసనకారులు పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: ఢిల్లీలో చలి విజృంభణ.. కశ్మీర్‌లో జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు!

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)