Breaking News

ముంచుకొస్తున్న ఎండలు.. ముందు జాగ్రత్తలివే..

Published on Mon, 03/03/2025 - 14:04

ఈ ఏడాది దేశంలో మార్చి నుంచే ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇలా మార్చి నుంచే ఎండలు మండిపోతే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలా మంది  ఇప్పటి నుంచే బెంబేలెత్తిపోతున్నారు.  దీనికితోడు ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్స్ వస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో వేసవి కాలంలో ఎదురయ్యే  అనారోగ్య సమస్యల నివారణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగుతుండాలి.

రోజులో ఒకటి రెండుసార్లు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ని ఉపయోగించాలి.  అలాగే నిమ్మరసం, మజ్జిగ /లస్సీ, పండ్ల రసాలతో పాటు ఇంట్లో తయారుచేసిన ఇతర పానీయాలలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి.

బయటకు వెళ్లేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్పప్పుడు కూడా వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. అలాగే తప్పనిసరై బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు, టోపీ, టవల్ వంటివి ఉపయోగిస్తూ నేరుగా శరీరానికి ఎండ తాకకుండా చూసుకోవాలి.

ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన వార్తలను తెలుసుకోవాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు తప్పనిసరైతేనే బయటకు వెళ్లాలి.

వేసవిలో ఉదయం వేళ  కిటికీలు, కర్టెన్‌లను మూసివేయాలి. సాయంత్రం సమయంలో చల్లని గాలి లోపలికి వచ్చేవిధంగా కిటికీలను తెరిచివుంచాలి.

శిశువులు, పిల్లలు, గర్భిణులు, ఆరుబయట పనిచేసేవారు, మానసిక అనారోగ్యం  కలిగినవారు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్నవారు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు వేడి వాతావరణంలోనికి వెళ్లినప్పడు వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటివారు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.

అధిక ఉష్ణోగ్రతలు  ఉన్న రోజ్లులో మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో వంట చేయడాన్ని తగ్గించాలి. ముందుగానే వంటపనులు పూర్తిచేసుకోవాలి. అలాగే వంట చేసే ప్రదేశంలో గాలి ఆడేందుకు తలుపులు, కిటికీలు తెరిచివుంచాలి.

పార్క్ చేసిన వాహనాలలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివెళ్లకూడదు. ఎందుకంటే వాహనం లోపల ఏర్పడే ఉష్ణోగ్రత వారి ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తుందనే సంగతిని గమనించాలి.

ఎండల కారణంగా వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్రవిసర్జన తగ్గడం, వేగంగా శ్వాస తీసుకోవడం, అధికంగా గుండె కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)