కవితకు సుఖేష్‌ చంద్రశేఖర్‌ లేఖ.. తీహార్‌ జైలు ప్రస్తావన..

Published on Tue, 03/19/2024 - 09:24

సాక్షి, ఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో నిందితుడు సుఖేష్‌ చంద్రశేఖర్‌.. ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్‌ జైలు క్లబ్‌లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

కాగా, సుఖేష్‌ మంగళవారం ఉదయం కవితకు లేఖ రాశారు. ఈ లేఖలో..‘తీహార్‌ జైలు కౌంట్‌డౌన్‌ మీకు ప్రారంభమైంది. త్వరలో మీరు తీహార్‌ జైలు క్లబ్‌లో సభ్యులు కాబోతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం త్వరలోనే అరెస్ట​్‌ అవుతారు. సింగపూర్‌, హాంకాంగ్‌, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదన అంతా బయటపడుతుంది. వాట్సాప్‌ చాటింగ్‌, కాల్స్‌పై దర్యాప్తు జరుగుతోంది. 

అరవింద్‌ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. ఈ కేసులో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు. మీ అందరికీ తీహార్‌ జైలులో స్వాగతం పలికేందుకు నేను ఎదురుచూస్తుంటాను’ అని పేర్కొన్నాడు. 

ఇదీ చదవండి: కవిత అరెస్టు.. ‘ఈడీ’ ప్రకటనపై ‘ఆప్‌’ ఫైర్‌

మరోవైపు, ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఏడు రోజుల కస్టడీలో భాగంగా నేడు మూడో రోజు ఈడీ అధికారులు కవితను ప్రశ్నించనున్నారు. మరోవైపు.. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. దీంతో, సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే అంశంపై సస్పెన్స్‌ నెలకొంది. 

👉: సుఖేష్‌ లేఖ ఇదే..

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)