Breaking News

Sudha Murty: 'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది!'

Published on Fri, 04/28/2023 - 12:13

రిషి సునాక్‌ అతి చిన్న వయసులో బ్రిటన్‌ ప్రధాని అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతని అత్తగారు సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలు.. అతని అధికార హోదాను మరోసారి వార్తల్లో హైలెట్‌గా నిలిచేలా చేసింది. ఈమేరకు ఇన్ఫోసిన్‌ వ్యవస్థాపకుడు, దిగ్జజ పారిశ్రామిక వేత్త నారాయణ మూర్తి భార్య సుధామూర్తి మాట్లాడుతూ..తన కూతురు కారణంగానే రిషి సునాక్‌ అతి చిన్న వయసులో యూకేకి ప్రధాని అయ్యారని ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న ఓ వీడియోలో అన్నారు. ఆ వీడియోలో..తన కూతురే దీన్ని సాధ్యం చేసిందన్నారు.

తాను తన భర్తను వ్యాపారవేత్తను చేస్తే తన కుమార్తె తన భర్తను ప్రధానిని చేసిందని చెప్పారు. "ఇదంతా భార్య మహిమే. భార్య భర్తను ఎలా మారుస్తుందో చూడండి. ఐతే నేను నా భర్తను మాత్రం మార్చలేకపోయాను..నేను ఆయన్ని కేవలం వ్యాపారవేత్తని చేశానని, కానీ నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో అన్నారు. కాగా, రిషి సునాక్‌ 2009లో అక్షతామూర్తిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడేళ్లలోనే యూకేకి ప్రధాని అయిన ఎంపీగా నిలవడమే గాక, అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా పేరుగాంచారు.

కాగా అక్షతమూర్తి ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్‌లలో ఒకరి కుమార్తె, దాదాపు 730 మిలియన్ల పౌండ్ల వ్యక్తిగత సంపదతో శక్తిమంతమైన మహిళగా ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు, భారతదేశానికి చెందినవారు. అక్షతామూర్తి తండ్రి నారాయణమూర్తి ఇన్పోసిస్‌ వ్యవస్థాపకుడు, భారతదేశంలోని అత్యంత సంపన్నులో ఆయన ఒకరు.

(చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్‌..144 సెక్షన్‌ విధింపు)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)