Breaking News

చంద్రబాబు అబద్ధాల కోరు

Published on Tue, 09/24/2024 - 05:20

సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరని, ఆయన అసత్యాలకూ ఓ చరిత్ర ఉందని ప్రముఖ న్యాయ­వాది, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్‌ స్వామి తీవ్రస్థాయిలో ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం హోదా­లోని వ్యక్తి ప్రచారం చేయడాన్ని ఖండించారు. చంద్రబాబు దు్రష్పచారాన్ని  శ్రీవారి భక్తులెవరూ నమ్మొద్దన్నారు. 

స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహా పాపమంటూ చంద్రబాబుకు హితవు పలికారు. తిరుమల లడ్డూ వివా­దంపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుబ్రమణి­యన్‌ స్వామి సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని తాను ‘సుప్రీం’ను ఆశ్రయించినట్లు సుబ్రమణియన్‌ స్వామి మీడియాకు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..  

బాబు మాటలకు, పనులకు పొంతన ఉండదు.. 
చంద్రబాబును నేను ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నా. ఆయన చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన ఉండదు. గతంలో ఏసుక్రీస్తు ఫొటోలున్నాయని.. కొండపై ఏదో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేసి ఇలాగే దు్రష్పచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై హైకోర్టుకు ఆధారాలను చూపించలేకపోయారు. నిజానికి.. చాలాఏళ్లుగా టీటీడీలో ఓ విధానం ఉంది.. అంత తేలిగ్గా ఎలా నెయ్యికల్తీ జరుగుతుంది?   

సిట్‌తో కాదు.. ‘సుప్రీం’తో విచారణ జరిపించాలి..
చంద్రబాబే ఆరోపణలు చేసి ఆయనే తన సిట్‌తో విచారణ జరిపించడం అనేది సరైంది కాదు. చంద్రబాబు చీప్‌ట్రిక్స్‌ అన్నీ బయటకు రావాలంటే ఆయన సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలి. ఎందుకంటే.. సిట్‌ పోలీసులు కేవలం సమాచారం మాత్రమే సేకరిస్తారు.. అదే సుప్రీంకోర్టు అయితే కల్తీ జరిగిందా లేదా అనేది తేలుస్తుంది. 

అలాగే, ఈ వ్యవహారానికి గల కారణాలు, వెనుక  ఎవరున్నారు, ఎందుకు చేశారు అనే విషయాలూ వెలుగులోకి వస్తాయి. అప్పుడు సీబీఐ విచారణ అవసరం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలా ఇన్ని అబద్ధాలు ఆడుతూ, చీప్‌ట్రిక్స్‌కు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు ఉండదు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అందరినీ జైలుకు పంపే కుట్రలో భాగమే ఈ చిల్లర రాజకీయాలు.  

చంద్రబాబు అబద్ధాల కోరు .. ఆయన చరిత్ర నాకు తెలుసు ..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)