Breaking News

సుభాష్‌ చంద్రబోస్‌ ఏం చదువుకున్నారు? ఐసీఎస్‌ ఎందుకు వద్దన్నారు?

Published on Tue, 01/23/2024 - 13:22

నేడు (జనవరి 23) స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. బోస్‌ పుట్టిన రోజును శౌర్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2021లో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విద్యార్హతలు ఏమిటి? ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, బోస్‌ ఎందుకు ఆ ఉద్యోగంలో చేరలేదో తెలుసుకుందాం. 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897, జనవరి 23న ఒడిశాలోని బెంగాల్ డివిజన్‌లోని కటక్‌లో జన్మించారు. బోస్ తన తల్లిదండ్రులకు తొమ్మిదవ సంతానం. బోస్ నాటి కలకత్తాలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. బోస్ కేవలం తన 24 ఏళ్ల వయసులో ఐసీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉన్నత ఉద్యోగాల అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, బ్రిటీష్ వారికి బానిసగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఉద్యోగంలో చేరలేదు. 

బోస్ స్వాతంత్ర్య పోరాటంలో కాలుమోపేందుకు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి, నాటి ప్రముఖ నేత చిత్తరంజన్ దాస్‌తో జతకట్టారు. 1921లో చిత్తరంజన్ దాస్‌కు చెందిన స్వరాజ్ పార్టీ ప్రచురించే ‘ఫార్వర్డ్’ అనే వార్తాపత్రికకు సంపాదకత్వ బాధ్యతలను బోస్ స్వీకరించారు. 1920 నుంచి 1942 వరకు భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఆవిష్కరింపజేసే ‘ది ఇండియన్ స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని బోస్‌ రచించారు. బోస్‌ 1939లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అయితే కొంతకాలానికే బోస్‌ ఆ పదవికి రాజీనామా చేశారు. నేతాజీ తన జీవితకాలంలో 11 సార్లు జైలు శిక్ష అనుభవించారు.
ఇది  కూడా చదవండి: స్వాతంత్య్రాన్ని ఊహించిన ‘బోస్‌’ ఏం చేశారు?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)