Breaking News

ఎంపీగా ఓడిన కొద్ది వారాలకే సీఎం

Published on Thu, 10/17/2024 - 04:09

శ్రీనగర్‌: జూన్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లాలో ఓటమిని చవిచూసిన ఒమర్‌ అబ్దుల్లా కేవలం కొద్ది వారాల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గతంలోనూ ఇలాగే 38 ఏళ్ల వయసులో తొలిసారిగా జమ్మూకశ్మీర్‌ సీఎంగా పగ్గాలు చేపట్టి రికార్డ్‌ సృష్టించారు. అత్యంత పిన్న వయసులో సీఎం అయి 2009–14 కాలంలో రాష్ట్రాన్ని పాలించారు.

స్కాట్లాండ్‌లోని స్ట్రాత్‌క్లీడ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేస్తూ చదువును మధ్యలో వదిలేసిన ఒమర్‌ 1998లో తొలిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 28 ఏళ్ల వయసులో 12వ లోక్‌సభకు ఎన్నికై అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1999లోనూ జయకేతనం ఎగరేసి పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 

గోధ్రా ఉదంతాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జమ్మూకశ్మీర్‌ శాసనసభ సమరంలో అడుగుపెట్టి చతికిలపడ్డారు. 2002లో నేషనల్‌ కన్ఫెరెన్స్‌ కంచుకోట గందేర్‌బల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అనామక ఖాజీ మొహమ్మద్‌ అఫ్జల్‌చేతిలో ఓడిపోయారు. తర్వాత 2004లో మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు. 

తర్వాత జమ్మూకశ్మీర్‌ అటవీప్రాంతాన్ని శ్రీ అమర్‌నాథ్‌ ఆలయబోర్డ్‌కు 2008లో ఇచ్చేందుకు నాటి అటవీమంత్రిగా అఫ్జల్‌ తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అసంతృప్తి నెలకొంది. దీన్ని అవకాశంగా మలచుకున్న ఒమర్‌ ఆందోళనలు లేవనెత్తారు. పార్టీ బలాన్ని పెంచి ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచించి ఎన్సీని అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారు. దీంతో 38 ఏళ్ల వయసులో ఒమర్‌ కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 54 ఏళ్ల ఒమర్‌ ప్రస్తుతం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అబ్దుల్లాల కుటుంబం నుంచి సీఎం అయిన మూడోవ్యక్తి ఒమర్‌. గతంలో ఈయన తాతా షేక్‌ అబ్దుల్లా, తండ్రి ఫరూక్‌ అబ్దుల్లా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 

చదవండి: నేనెందుకు అరెస్టయ్యానో మీకు తెలుసా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)