Breaking News

టీచర్‌పై మనసుపడిన విద్యార్థి.. ప్రేమను కాదన్న పాపానికి..

Published on Wed, 08/20/2025 - 12:55

భోపాల్‌: అతడో విద్యార్థి.. టీచర్స్‌ చెప్పే పాఠాలు బుద్దిగా వినాల్సింది పోయి.. అనుచితంగా ప్రవర్తించాడు. సదరు మహిళా టీచర్‌ను విద్యార్థి వేధింపులకు గురి చేశాడు. తన ప్రేమను కాదన్నందుకు ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. న‌ర్సింగ్‌పూర్ జిల్లాలోని ఎక్స‌లెన్స్ స్కూల్‌లో నిందితుడిని సూర్యవంశ్‌ కొచార్‌(18) చదువుకుంటున్నాడు. అదే పాఠశాలలో బాధిత యువతి(26) గెస్ట్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సదరు టీచర్‌పై సూర్యవంశ్‌ ప్రేమ పెంచుకున్నాడు. అయితే, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్స‌వం సందర్భంగా.. ఆ వేడుకలకు బాధిత టీచర్ చీర కట్టుకుని హాజరయ్యారు. ఈ సందర్భంగా టీచర్ చీరపై సూర్యవంశ్ అసభ్యకరమైన కామెంట్లు చేశాడని సమాచారం. దీంతో, ఈ అంశంపై టీచ‌ర్ ఫిర్యాదు చేసింది. బాధిత టీచర్ ఫిర్యాదుతో స్కూలు యాజమాన్యం సూర్యవంశ్‌పై చర్యలు తీసుకుంది.

ఈ క్రమంలో టీచర్‌పై ప‌గ ప‌ట్టిన అత‌ను పెట్రోల్ దాడికి ప్లాన్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం టీచర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న టీచర్ ను పిలిచి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై చల్లి, నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో బాధితురాలికి 10 నుంచి 15 శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయమేమీ లేదని పేర్కొన్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు.. సూర్యవంశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ విద్యార్థిపై 124ఏ సెక్ష‌న్ కింద కేసు బుక్ చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)