Breaking News

వీధి కుక్కల తీర్పు వివాదం.. అత్యవసర స్టేకి నిరాకరణ

Published on Thu, 08/14/2025 - 12:21

న్యూఢిల్లీ: రాజధాని రీజియన్‌లోని జనావాసాల నుంచి వీధికుక్కలను తొలగించాలనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలపై అత్యవసరంగా నిలుపుదల చేయాలని పిటిషనర్లు కోరగా.. అందుకు ధర్మాసనం తిరస్కరించింది.

👉జంతు పరిపరక్షణ విభాగాల తరఫున సీనియర్‌ లాయర్‌ కపిల్ సిబాల్ వాదిస్తూ.. ‘‘వీధి కుక్కలను తరలించడానికి సరిపడా షెల్టర్‌ హోమ్స్‌ లేవు. అలాంటప్పుడు వాటిని ఎక్కడికి తరలిస్తారు? ఎక్కడ ఉంచుతారు?. పోనీ ఒకవేళ ఒకే దగ్గర అన్నేసి కుక్కలను ఉంచితే.. అవి తిండి కోసమో లేదంటే మరేయితర సందర్భాల్లో పరస్పరం దాడి చేసుకుంటాయి. అంతేకాదు.. ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇలా ఎలా చూసుకున్నా.. గతంలో ఇచ్చిన ఆదేశం అమలు చేయలేనిది. కాబట్టి ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయండి అని కోరారు. మరో సీనియర్‌ లాయర్‌ అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. ఆదేశాలు అమలు చేయడానికి అవసరమైన వసతులు లేవు. ఇదెలా ఉందంటే.. గుర్రానికి ముందు బండిని కట్టేసినట్లు ఉంది. అలాగని వీధికుక్కల దాడులు.. కుక్క కాటు ఘటనలు తీవ్రమైనవనే పిటిషనర్లు భావిస్తున్నారు. అలాగని పరిష్కారం హింసాత్మకంగా ఉండకూడదు’’ అని వాదించారు.

👉ఢిల్లీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ‘‘జంతువులను ఎవరూ ద్వేషించడం లేదు. వీధికుక్కల దాడుల్లో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం స్టెరిలైజేషన్‌ (సంతానరహిత క్రియ) అనేది రేబిస్‌ను ఆపదు. కిందటి ఏడాది 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదు అయ్యాయి. 

పిల్లలు స్వేచ్ఛగా వీధుల్లో ఆడలేని.. అమ్మాయిలు తిరగలేని పరిస్థితి. దీనిపై వివాదం కాదు.. సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మాంసాహారం తినేవారే జంతు ప్రేమికులమని ప్రకటించుకుంటున్నారు. ఇక్కడ కుక్కలను చంపాల్సిన అవసరం లేదు. వాటిని జనావాసాల నుంచి వేరు చేయడమే ఉద్దేశం’’ అని వాదించారు.   

👉అయితే.. సుప్రీం కోర్టు ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు జనాల్లోకి చేరకముందే.. కొన్ని ప్రాంతాల్లో అధికారులు కుక్కలను పట్టుకోవడం పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే.. ‘‘పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. నిబంధనలు రూపొందిస్తుంది. కానీ, అధికారుల బాధ్యాతారాహిత్యం వల్ల క్షేత్ర స్థాయిలో అవి అమలు కావడం లేదు. Animal Birth Control (ABC) నిబంధనలను అధికారులు సక్రమంగా అమలు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు’’ కోర్టు వ్యాఖ్యానించింది. ఓ మనుషులు పడుతున్న బాధ.. మరోవైపు జంతు ప్రేమికుల ఆందోళన.. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో గత ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. 

ఆదేశం ఇలా..
వీధి కుక్కల దాడులు, రేబిస్‌ బారినపడి పలువురు మరణించిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో.. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని  జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది. ఇందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల గడువును ఢిల్లీ ప్రభుత్వానికి విధించిన సుప్రీం కోర్టు.. అవి మళ్లీ జనావాసాల్లోకి వస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించింది. 

అదే సమయంలో శునకాల తరలింపును గనుక అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించిది కూడా. ఈ నేపథ్యంలో ఈ తీర్పు సమంజసం కాదంటూ జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. కొందరు(వీళ్లలో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు) సోషల్‌ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆదేశాలను పునఃపరిశీలిస్తానని హామీ  ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌.. ఈ పిటిషన్‌ను ముగ్గురు జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)