Breaking News

Delhi: విదేశీ కోచ్‌లపై వీధి కుక్కల వీరంగం

Published on Sat, 10/04/2025 - 12:52

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా, జపాన్ కోచ్‌లపై వీధి కుక్కలు దాడి చేశాయి. కెన్యా కోచ్ డెన్నిస్ మరాగియా మ్యాన్జో కుడి కాలిపై కుక్క కరవడంతో అతనిని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. జపాన్ కోచ్ మెయికో ఓకుమాట్సు కూడా కుక్కల దాడి బారినపడ్డారు. ఈ ఘటన దరిమిలా స్టేడియం భద్రతా దళం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో వీధికుక్కలను పట్టుకునేందుకు ఢిల్లీ సర్కారు ఉపక్రమించింది.

వివరాల్లోకి వెళితే టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా  కోచ్‌ను స్టేడియం ప్రాంగణంలోకి చొరబడిన వీధి కుక్క కరిచింది. దీనిపై అథ్లెట్లు, సహాయక సిబ్బంది తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. కెన్యా స్ప్రింట్స్ కోచ్ డెన్నిస్ మరాగియా మ్వాన్జో వార్మప్ ట్రాక్‌పై అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా కుక్క దాడికి గురయ్యారు. స్టార్టింగ్ బ్లాక్స్‌ను సరిచేస్తుండగా, వీధికుక్క అతని వెనుక నుండి వచ్చి ఆయన కుడి కాలిపై కరిచింది. అక్కడే ఉన్న మెడికల్ టీమ్ ఆయనకు ప్రథమ చికిత్స అందించింది. తరువాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. డెన్నిస్ మరాగియాకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
 

కెన్యా కోచ్‌పై  జరిగిన దాడి తరువాత  జపాన్ పారా అథ్లెటిక్స్ అసిస్టెంట్ కోచ్ మెయికో ఓకుమాట్సు పైనా కుక్క దాడి చేసింది. దీంతో ఆమె ఎడమ కాలిపై తీవ్ర గాయమయ్యింది. ఈ ఘటనలన్నీ స్టేడియం ట్రాక్‌లోనే జరిగాయి. ఓ సెక్యూరిటీ గార్డును కూడా వీధికుక్క కరిచినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ఆర్గనైజింగ్ కమిటీ స్టేడియంలోనికి వీధికుక్కలు రాకుండా  చూడాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేసింది. స్టేడియం సమీపంలోనివారు ఇక్కడ కుక్కలకు ఆహారం వేయడంతో అవి  లోనికి ప్రవేశిస్తున్నాయని కమిటీ తెలిపింది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)