Breaking News

ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి.. ప్రయాణీకులకు గాయాలు!

Published on Fri, 09/27/2024 - 12:20

పాట్నా: ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లపై దాడుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు ఆకతాయిలు రైలు ప్రమాదం జరిగేందుకు కుట్రలు చేస్తున్నారు. రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్లు పెట్టడం, పట్టాలకు ఉన్న హుక్స్‌ తీయడం వంటివి చేస్తున్నారు. కొందరు మాత్రం రైళ్లు సమయంలో రాళ్లు విసురుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌ రైలుపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు సైతం గాయాలయ్యాయి.

వివరాల ప్రకారం.. బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌ రైలుపై గురువారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. రైలు జైనగర్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ముజఫర్‌పూర్‌ – సమస్తిపూర్‌ మార్గంలో సమస్తిపూర్‌ రైల్వే స్టేషన్‌ ఔటర్‌ సిగ్నల్‌ సమీపంలో రాత్రి 8:50 గంటల ప్రాంతంలో దాడి ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు రైలుపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో స్లీపర్‌ కోచ్‌, రైలు ప్యాంట్రీకార్‌, పక్క కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

 

 

రైలుపై రాళ్ల దాడి ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. వారికి హుటాహుటిన సమస్తిపూర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు రాళ్ల దాడి ఘటనపై రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దాడి కారణంగా రైలు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

 ఇది కూడా చదవండి: వుతియా పండుగ వేడుకల్లో విషాదం.. 46 మంది మృతి

Videos

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)