Breaking News

వందేభారత్‌పై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు

Published on Thu, 11/28/2024 - 11:56

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్ వెళ్తున్న వందే భారత్  ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మీరట్ నుండి మోదీనగర్‌కు వస్తుండగా ఈ స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల ముందుగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడితో రైలు అద్దాలు పగిలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ ప్రాంతంలో టార్గెట్ చేయడం ఇది నాలుగోసారి. గతంలో అక్టోబర్ 22, 27 తేదీల్లో, నవంబర్ 22, 27 తేదీల్లో ఇదేవిధమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ నెలలో సిక్రి కలాన్- సోనా ఎన్‌క్లేవ్ కాలనీ సమీపంలో, నవంబర్‌లో హనుమాన్‌పురి- శ్రీనగర్ కాలనీ సమీపంలో వందేభారత్‌ రైలుపై రాళ్లు రువ్వారు.

ఘజియాబాద్ పోలీసులు  ఈ నాలుగు ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వందేభారత్‌పై రాళ్లు రువ్వుతున్న ఘటనలు అటు రైల్వే యంత్రాంగాన్ని, ఇటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ తీర్పుతో 16 ఏళ్లకు కానిస్టేబుల్‌ కుటుంబానికి న్యాయం

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)