Breaking News

Lucknow: 24 గంటల్లో రెండు వందేభారత్‌ రైళ్లపై దాడి

Published on Thu, 09/05/2024 - 13:14

లక్నో: కొందరు అల్లరిమూకలు వందేభారత్‌ రైళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారనే వార్తలను అప్పుడప్పుడు మనం వింటుంటాం. తాజాగా గడచిన 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటి సంఘటన బుధవారం రాత్రి యూపీలోని లక్నో- పట్నా వందే భారత్‌పై జరగగా, రెండవ ఘటన గురువారం ఉదయం రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై జరిగింది.

బుధవారం రాత్రి లక్నో నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై అల్లరి మూకలు భారీగా రాళ్లు రువ్వారు.ఈ దాడి కారణంగా రైలులోని సీ-5 కోచ్‌ అద్దాలు పగిలిపోయాయి. యూపీలోని వారణాసి స్టేషన్ నుండి రైలు బయలుదేరిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. రైల్వేశాఖ కూడా విచారణ చేపట్టింది.

ఇదేవిధంగా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందే భారత్ రైలుపై గురువారం ఉదయం రాళ్ల దాడి జరిగింది. 24 గంటల్లోనే రెండు వందేభారత్ రైళ్లపై దాడి జరిగిందని రైల్వేశాఖ తెలిపింది. రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలు నంబర్ 22350లోని బోగీ నంబర్ ఈ వన్‌పై రాళ్ల దాడి జరిగింది. ఇందులో ఐదు, ఆరో నంబర్ సీట్ల సమీపంలోని అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన హజారీబాగ్‌లోని చార్హి- బేస్ రైల్వే స్టేషన్ మధ్య జరిగింది.

ఈ రాళ్లదాడిలో కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో రైలులో కూర్చున్న ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వేశాఖ  అధికారులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా  అల్లరి మూకలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)