Breaking News

New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట

Published on Mon, 03/24/2025 - 07:15

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌(New Delhi Railway Station)లో మరోసారి  భారీ రద్దీ ఏ‍ర్పడింది. దీంతో తొక్కిసలాట  జరిగిందనే వదంతులు వ్యాపించాయి. స్టేషన్‌లోని 12,13 ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల కోసం వేచివుండగా, తొక్కిసలాటను తలపించే పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

శివగంగా ఎక్స్‌ప్రెస్, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్(Swatantra Senani Express), జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్, మగధ్ ఎక్స్‌ప్రెస్‌లు బయలుదేరడంలో ఆలస్యం కావడంతో ఇటువంటి పరిస్థితి ఏ‍ర్పడింది. ప్రయాణికుల రద్దీని గమనించిన ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమై, తమ బృందాలను మోహరించారు. ప్టేషన్‌లో ప్రస్తుతానికి ఎవరూ గాయపడినట్లు వార్తలు లేవు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్‌లోని రెండు ప్లాట్‌ఫారాలపై ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

గతంలో మహా కుంభమేళా సమయంలో కనిపించిన రద్దీ మరోమారు ఎదురయ్యింది. ఈ నేపధ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపడుతున్నారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో అధిక రద్దీ  ఏర్పడిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. ఈ  రద్దీపై రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. అయితే తొక్కిసలాట లాంటి పరిస్థితి  ఎదురుకాలేదు’ అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ  ఉదంతంలో రైల్వేశాఖ ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. తొక్కిసలాట కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది.

ఇది కూడా చదవండి: ఇండియా గేట్‌, రాష్ట్రపతి భవన్‌.. అంతటా అంథకారం.. కారణమిదే..

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)