Breaking News

14 ఏళ్లకే నూరేళ్లు

Published on Thu, 06/05/2025 - 07:48

బనశంకరి: ఐపీఎల్‌ కప్‌ సొంతం చేసుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజయోత్సవం సిలికాన్‌ నగరంలో ఘోర విషాదాన్ని నింపింది. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ జట్టుకు సన్మానోత్సవం ఉండగా, కళ్లారా చూడాలని వేలాది మంది జనసాగరంలా తరలివచ్చారు. గేట్‌ –12 వద్ద వారిని నిలువరించడానికి పోలీసులు లాఠీచార్జీ చేయడం, జనం నలుదిక్కులా పరుగులు తీశారు,  బ్యారికేడ్లను తోసివేసి గేట్లు విరగ్గొట్టి స్టేడియంలోకి చొరబడ్డారు.

ఈ గందరగోళంలో తొక్కిసలాట సంభవించింది. ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ వెళ్లడంతో పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. అరుపులు, కేకలు, ఏడుపులు మిన్నంటాయి. ఏం జరుగుతోందో ఎవరికీ తెలియలేదు. అనేకమంది స్పహ తప్పి పడిపోయారు. దీంతో జనమే బాధితులను చేతుల మీద, భుజాల మీద ఎత్తుకుని అంబులెన్సుల కోసం పరుగులు తీశారు. ఏదో యుద్ధ ప్రాంతంలోని ఘోర కలిలా మారిపోయింది.

 అచేతనంగా పడిపోయిన కొందరికి సీపీఆర్‌ కూడా చేయసాగారు. బాధితులను సమీప బౌరింగ్, వైదేహి, మాల్య ఆస్పత్రులకు తీసుకెళ్లారు. బాలిక, యువతీ యువకులు కలిసి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మందికి పైగా  గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామందికి కాళ్లు, చేతులు ఫ్రాక్చర్‌ అయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చిన్న చిన్న గాయాలైన కొందరు చికిత్స తరువాత డిశ్చార్జి అయ్యారు. తమవారికి ఏమైందో తెలియక అనేకమంది బంధుమిత్రులు రోదిస్తూ పరుగులు తీశారు.

శివమొగ్గలో బైకిస్టు మృతి 
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో మంగళవారం రాత్రి యువకులు ఆర్‌సీబీ విజయోత్సవం జరుపుకొన్నారు. గోపి సర్కిల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఈ సమయంలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎడాపెడా బాదడంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. కొంత మంది యువకులకు గాయాలయ్యాయి. అలాగే ఉషా నర్సింగ్‌ హోం సర్కిల్‌ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొని ఓ బైకిస్టు దుర్మరణం చెందాడు, మరో ఇద్దరు యువకులు గాయపడి ఆస్పత్రిలో చేరారు.

14 ఏళ్లకే నూరేళ్లు 
14 ఏళ్ల దివ్యాంశి అనే బాలిక కూడా మరణించింది. 9వ తరగతి చదివే బాలిక తల్లిదండ్రులు శివకుమార్, అశి్వనితో కలిసి ఆర్‌సీబీ టీంని చూడాలని స్టేడియానికి వచ్చింది. తొక్కిసలాటలో చిక్కి చనిపోయింది.

సీఎం పరామర్శ  
బౌరింగ్‌ ఆసుపత్రికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య , హోంమంత్రి పరమేశ్వర్‌ చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వమే వైద్యఖర్చులను భరిస్తుందని తెలిపారు. కొందరు యువకులు మాట్లాడుతూ స్టేడియం వద్ద కనీస ఏర్పాట్లు లేవని, స్టేడియం లోపలికి వెళ్తామంటే గేట్లు తీయలేదని, పైగా పోలీసులు లాఠీలతో కొట్టడంతో జనం పరిగెత్తారని ఆరోపించారు.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)