Breaking News

కరుణానిధి జయంతి వేళ స్టాలిన్ భావోద్వేగం

Published on Wed, 06/03/2026 - 12:52

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, ద్రవిడ రాజకీయ దిగ్గజం ఎం. కరుణానిధి జయంతి వేళ చెన్నైలో నేడు (బుధవారం) భావోద్వేగ వాతావరణం నెలకొంది. డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ తన తండ్రి కరుణానిధికి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలైన నేపథ్యంలో, ఈ వేదికగా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, డీఎంకే శ్రేణుల శపథాలు తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
 

చెన్నైలోని ఒమందురార్ ప్రభుత్వ ఎస్టేట్‌లో ఉన్న కలైంజ్ఞర్ కరుణానిధి విగ్రహానికి సీఎం ఎం.కే. స్టాలిన్ పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పార్టీ అగ్ర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళనాడు రాజకీయ, సామాజిక అభివృద్ధికి కరుణానిధి చేసిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 


అనంతరం డీఎంకే ప్రధాన కార్యాలయంలో స్టాలిన్ స్వయంగా పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచి, ఆ తర్వాత పార్టీ యూత్ వింగ్ కార్యాలయాన్ని కూడా సందర్శించారు.
 

‘ఎక్స్’ వేదికగా స్టాలిన్ భావోద్వేగ శపథం
కరుణానిధి జయంతిని పురస్కరించుకుని స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, అత్యంత ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘చివరి శ్వాస వరకు చక్రాల కుర్చీకే పరిమితమైనా, విశ్రాంతి అనేది లేకుండా తమిళ ప్రజల అభ్యున్నతి కోసం శ్రమించిన మహోన్నత నాయకుడు కరుణానిధి’ అని కొనియాడారు. గెలుపోటములకు లొంగని తండ్రి గుణమే తనకూ ఉందన్న స్టాలిన్ ‘ప్రస్తుతం మనం విజయావకాశాన్ని కోల్పోయాం. కానీ, ఆ సూర్యుడి వెలుగుతో తమిళనాడును కమ్మేసిన చీకట్లను త్వరలోనే పారద్రోలుతాం.. మళ్లీ విజయగాథను లిఖిస్తాం’ అంటూ కార్యకర్తల్లో కొత్త  ఉత్సాహాన్ని నింపారు.
 

ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్న డీఎంకే ఎంపీ టి. సుమతి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీని ఆమె ‘ఫీనిక్స్’ పక్షితో పోల్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బూడిద నుంచి సైతం తిరిగి లేచే శక్తి పార్టీకి ఉందన్నారు. ఎంకే స్టాలిన్ నాయకత్వంలో పార్టీ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని, కరుణానిధి ఆశయ సాధనలో తామంతా కలిసికట్టుగా ముందడుగు వేస్తామని ఆమె స్పష్టం చేశారు. 1957లో అసెంబ్లీలో అడుగుపెట్టి, దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధి వారసత్వాన్ని స్టాలిన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని నేతలు కొనియాడారు.

103వ జయంతి వేడుకలు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి (కలైంజ్ఞర్) 103వ జయంతి వేడుకలను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. డీఎంకే అధినేత, సీఎం ఎం.కే. స్టాలిన్ మెరీనా బీచ్‌లోని కరుణానిధి స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున మంత్రి రాజ్‌మోహన్, కరుణానిధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తన తాత కరుణానిధికి ఘన నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో డీఎంకే మంత్రులు, సీనియర్ నాయకులు, కూటమి పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయ విజేత 
మరోవైపు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఐఎన్‌సీ) కూడా కరుణానిధికి ఘనంగా నివాళులర్పించింది. ఆయనను ఒక దార్శనికుడిగా, గొప్ప రచయితగా, సామాజిక న్యాయ విజేతగా కాంగ్రెస్ అభివర్ణించింది. సమానత్వం, విద్య, ప్రజల సంక్షేమం కోసం కరుణానిధి చూపిన నిబద్ధత భారతదేశంలోని రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందని తమ ‘ఎక్స్’ సందేశంలో పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)